కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ రోటరీ క్లబ్ లో సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మాన్యపు హాజరై మాట్లాడుతూ దేశం మనకెంతో ఇచ్చిందని, మనం కూడా సేవ చేసి దేశం రుణం తీర్చుకోవాలని, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోటి స్వచ్ఛంద సంస్థను స్థాపించిన …
Read More »ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. …
Read More »కలెక్టరేట్ దేవాలయం, అధికారులు దేవుళ్ళు…
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరచి రాష్ట్రం, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుటలో అధికారులు నిబద్దతగా చిత్తశుద్దితో పనిచేయాలని, తన వంతు పూర్తి సహకారమందిస్తానని కామారెడ్డి శాసనసభ్యలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో అవినీతిరహిత పారదర్శక పాలన అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా, నియోజక వర్గ, …
Read More »శీతాకాలంలో పాడి పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మారుతున్న సీజనకు అనుగుణంగా పంటల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో పాడిపశువుల విషయంలోనూ అన్నే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి సింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు మేతమేయడానికి అంత ఆసక్తి చూపవని దీని వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుందని అందుకే పశువులకు అందించే దాణా విషయంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. …
Read More »అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
కామారెడ్డి, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎస్‌జిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి హాకీ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడానికి …
Read More »ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
కామారెడ్డి, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాల స్థాయికి చేరుకోవాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని జిల్లాకు నోడల్ అధికారిగా నియమించిన భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ అశ్విని శ్రీవాత్సవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధామ్య పథకాలను అర్హులైన లబ్ధిదారుల చెంతకు తీసుకు వెళ్ళడమే కాకుండా, కొత్త …
Read More »బూత్ లెవల్ అధికారులకు ముఖ్య గమనిక
కామారెడ్డి, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బూతు లెవల్ అధికారుల వద్ద సమగ్ర సమాచారం ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏఆర్‌ఓల మాస్టర్ ట్రేనర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. బూతు లెవెల్‌లో ఉన్న ఓటర్ల సంఖ్య, పురుషులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ ఎంతమంది ఉన్నారనే …
Read More »దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
కామరెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి బావయ్య అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు వివిధ క్రీడా పోటీల విజేతలకు శుక్రవారం బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి బావయ్య మాట్లాడారు. ప్రతి …
Read More »రోడ్డున పడ్డం సారూ….
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏంటో గాని ఆటో డ్రైవర్లము రోడ్డుపైన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆడవాళ్లకు బస్సులో ఉచిత ప్రయాణంను మేము …
Read More »సెవెన్ హార్ట్స్ ఎన్జీవో అధ్వర్యంలో ప్రతిభ పోటీలు
కామారెడ్డి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్ హాట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో కామారెడ్డి వారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యానగర్ రోటరీ క్లబ్ లో ఇంటర్ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జూనియర్ కళాశాల నుంచి 100 మంది పాల్గొన్నారు. చిత్రలేఖనం, ఉపన్యాస, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. పాల్గొనీ …
Read More »