Kamareddy

ఆరు రకాల కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెట్విన్‌ సంస్థ (యువజన సర్వీసుల శాఖ ) ఆధ్వర్యంలో మూడు నెలల కాలపరిమితి గల ఆరు రకాల కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని ఆ సంస్థ కో ఆర్డినేటర్‌ సయ్యద్‌ మొయిజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏం.ఎస్‌. ఆఫీసు, అకౌంట్స్‌ ప్యాకేజి, టైలరింగ్‌ అండ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌, మగ్గం వరకు, మెహందీ కోర్సులలో ఈ నెల …

Read More »

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :దివ్యాంగులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియం బుధవారం అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని సూచించారు. నేటి ఓటమి రేపటి గెలుపుకు దోహదపడుతుందని తెలిపారు. క్రీడా పోటీలకు …

Read More »

స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితా సవరణ-2024లో భాగంగా జిల్లాలలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన …

Read More »

చక్కటి కార్యాచరణ ప్రణాళిక, చిత్తశుద్దితో పనిచేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజక అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఇందుకు తన పూర్తి సహకారముంటుందని జుక్కల్‌ శాసనసభ్యులు తోట లక్ష్మికాంత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పంచాయతీ రాజ్‌, ఆర్‌ అండ్‌ బి, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌, విద్య, …

Read More »

దేవునిపల్లిలో చోరీ

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ సి బ్లాక్‌ 9వ నంబర్లో దొంగలు చొరబడ్డారు. నగదు, బంగారం, వెండి అపహరించుకుపోయారు. బాధితులు వడ్ల కల్పన, భర్త వడ్ల అశోక్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమ మామ చనిపోతే ఊరికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువా తాళాలు పగలగొట్టి చోరీకి …

Read More »

నేడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రారంభం

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను ఆదివారం జిల్లాలోని కామారెడ్డి, యెల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సవాడ నియోజక వర్గాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభించానున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డ్డి నియోజక వర్గంలోని దోమకొండ …

Read More »

కోర్టులో ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభం

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైకోర్టు జడ్జి లక్ష్మీనారాయణ శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధు శర్మ, కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మొక్కలను అందించారు. అనంతరం ఆయన కామారెడ్డి కోర్టులో ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభించారు. కోర్టులో పెండిరగ్లో ఉన్న …

Read More »

11న యధావిధిగా ప్రజావాణి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 11 నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రక్రియ …

Read More »

మహాలక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాలక్ష్మి పథకమును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్‌ ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ.10 లక్షలకు …

Read More »

పనిచేయని యంత్రాలు తరలింపు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనిచేయని కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వి వి ప్యాడ్‌ యంత్రాలను శుక్రవారం ఈసీఐసి హైదరాబాద్‌ కు పంపినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కామారెడ్డి లోని స్ట్రాంగ్‌ రూమ్ను, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం వేసి సీజ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »