కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాహిత్యం సమాజ బావను కోరుకుంటుందని, కవులు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని, అన్యాయాన్ని నిర్మూలించి సమాజాని నిర్మాణానికి కవులు కృషి చేస్తారని నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బీడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గపూర్ శిక్షక్ …
Read More »రూ. 645 కోట్లు రైతుల ఖాతాలో జమచేశాము
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నాడు 66 లారీలు సమకూర్చి 14 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,580 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తెలిపారు. ప్రస్తుత యాసంగి కొనుగోళ్ళకు సంబంధించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు గత మార్చి 26 న ప్రాథమిక సహాకార సంఘాల ద్వారా 327, ఐకెపి ద్వారా 23 కొనుగోలు …
Read More »నీటి సమస్య తీర్చండి సారూ…
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం దేవునిపల్లి రెండు పడక గదుల ఇండ్ల కాలనీలో వారం రోజులుగా నీరు రాకపోవడంతో మహిళలు, చిన్న పిల్లలు బిందెలు పట్టుకొని వెంచర్ల నుండి నీరు మోసుకుంటున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడు నెలలుగా నీటి ఇబ్బంది ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఎండాకాలం కావడంతో వాటర్ ట్యాంకర్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అధికారులు …
Read More »కూలీలకు ఉత్సాహం కలిగించిన కలెక్టర్
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయ క్షేత్రంలో పాంపాడ్ లు నిర్మించుకోవడం ద్వారా అటు వ్యవసాయంతో పాటు ఇటు చేపల పెంపకం చేపట్టి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. శనివారం కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో ఉపాధి హామీ పధకం క్రింద నిర్మిస్తున్న ఫార్మ్ పాంపాడ్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశిలించారు. తాను కూడా గడ్డపార చేతబట్టి మట్టిని …
Read More »నిరాడంబరంగా అవతరణ వేడుకలు
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశమందిరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా …
Read More »పనుల పురోగతి పట్ల కలెక్టర్ సంతృప్తి
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం క్యాతంపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించి పురోగతిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్ పనులను పరిశీలించి రెండు రోజులలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. …
Read More »జూన్ 7న జడ్పి సాధారణ సర్వసభ్య సమావేశం
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషద్ సాధారణ సర్వ సభ్య సమావేశం జూన్ 7 న ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరం నందు జెడ్పి అధ్యక్షురాలు దఫెదార్ శోభ రాజు అద్యక్షతన జరుగుతుందని జెడ్పి ముఖ్య కార్యనిర్వాహనాధికారి చందర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు, అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావలసినదిగా ఆయన కోరారు. …
Read More »నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి… కలెక్టర్
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వానాకాలం పంటసాగుకు సంబంధించి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం బిక్నూర్ మండలంలోని విత్తన పంపిణి కేంద్రాలను, పెస్టిసైడ్స్ దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పిఎసిసిఎస్ లోని దయించ స్టాక్ పాయింట్, రైతువేదికలో పర్మిట్ ఇష్యూ , …
Read More »దివ్యాంగులకు సూచన
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాటరీ ట్రై సైకిళ్ళ రిపేరింగ్ పై శశిక్షణ ఇచ్చుటకు మెకానిక్ రిపేరింగ్ లో అనుభవం గల దివ్యాంగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఇద్దరు దివ్యాంగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వికలాంగుల ఆర్ధిక పునరావాస పధకం క్రింద ఋణం అందిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి …
Read More »ఏకగ్రీవంగా వైస్ ఛైర్మన్ ఎన్నిక
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మునిసిపల్ వైస్ చైర్ పర్సన్‌గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15 న వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ చైర్ పర్సన్ గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్ చైర్ పర్సన్ పోస్టుకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆథరైజ్డ్ …
Read More »