Kamareddy

ఈవిఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్లు, వివి ప్యాట్లు పనిచేస్తున్న తీరును పరిశీలించారు. ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్లు, వివి ప్యాట్‌ యంత్రాలు పనిచేస్తున్న తీరును ఇంజనీర్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఎన్నికల పరిశీలకుడు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

కామారెడ్డిలో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రివర్యులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, టీపీసీసీ మహిళ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు పెరుగుతన్న కూరగాయల ధరలకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ తెలంగాణ ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలకు …

Read More »

51 వసారి రక్తదానం

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన హజీర బేగం (58) కాలు ఆపరేషన్‌ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌ 51 వ …

Read More »

తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు/ జూనియర్‌ కళాశాలల్లో ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధనకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 వరకు పీజీ, బీఈడీలో 50 శాతం మార్కులతో రెండవ శ్రేణిలో ఉత్తీర్ణులై, టెట్‌ అర్హత సాధించిన వారు కామారెడ్డిలో …

Read More »

పక్షంరోజుల్లో లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాఖల వారిగా ఇచ్చిన హరితహారం లక్ష్యాలను ఈనెల 15లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో హరితహారం లక్ష్యాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అన్ని మండలాల్లో బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు పూర్తి …

Read More »

పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య

కామరెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ …

Read More »

గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట్‌ మండలంలోని సిద్ధాపూర్‌ నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభం చేసినట్లు గ్రామ సర్పంచ్‌ పచ్చంటి సత్తయ్య తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 20 లక్షల రూపాయల నిధులతో ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సహకారంతో జిల్లాలోనే నూతన గ్రామ పంచాయతీలలో మొట్టమొదటిసారిగా సిద్దాపూర్‌ గ్రామపంచాయతీ భవనానికి నిధులు కేటాయించడం …

Read More »

కామారెడ్డిలో 28.60 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం, పొడు భూముల పట్టాల పంపిణీ, పెట్టుబడి సాయం, రెండో విడత గొర్రెల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ, బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపిక, ఆయిల్‌ ఫామ్‌ సాగు, యాసంగి ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై సిఎస్‌ శాంతి కుమారి వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ …

Read More »

సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

కామరెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ప్రజావాణి లో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు …

Read More »

మౌలిక వసతుల కల్పనలో బిఆర్‌ఎస్‌ విఫలం

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాఠశాలలలో మౌలిక సదుపాయాలని కల్పించాలని నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లిటిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పర్లపల్లి రవీందర్‌, డాక్టర్‌ బాలు, జనపల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »