కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 14 నుంచి 22 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని …
Read More »సిడిసి చైర్మన్‌కు సన్మానం
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిడిసి చైర్మన్‌గా (చెరుకు అభివృద్ధి కమిటీ) నూతనంగా ఎన్నికైన ఐరేణి నర్సయ్యను దోమకొండ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం, పద్మశాలి యువజన సంఘం, పాండిదారులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఐరేణి నర్సయ్య మాట్లాడుతూ చెరుకు రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటానని, నాపై నమ్మకంతో సిడిసి చైర్మన్ పదవిని అప్పగించినందుకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు కృతజ్ఞతలు …
Read More »కళాభారతిలో కవిసమ్మేళనం
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11వ తేదీ ఆదివారం సాహిత్య దినోత్సవంను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియమ్‌లో మధ్యాహ్నం 1:00 గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కవిసమ్మేళనములో పాల్గొనే వారు అంబీర్ మనోహర్ రావు, సమన్వయకర్త ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్.నెం:9666692226 ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Read More »ప్లాస్టిక్ నియంత్రణకు కృషిచేయాలి
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ నియంత్రణకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. శ్రీదేవి అన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆవరణలో జిల్లా న్యాయ సేవా సమస్త ఆధ్వర్యంలో గురువారం ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ నిర్మూలనలో మహిళలు భాగస్వాములు కావాలని …
Read More »మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపల ఆహారం ఆరోగ్యానికి వరం లాంటిదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నాన్ వెజ్, వెజ్ మార్కెట్లో గురువారం చేపల ఆహారమేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపల ఆహార పండగను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు వంద శాతం రాయితీపై చేప విత్తనాలను ఇస్తుందని తెలిపారు. …
Read More »లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్కీ డ్రా ద్వారా 45 మంది గిరిజన విద్యార్థుల ఎంపిక చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం 3, 5,8 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కోసం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. మూడవ తరగతికి 15 మంది బాలురు, 8 మంది బాలికలను ఎంపిక చేశారు. ఐదవ తరగతికి …
Read More »పారిశ్రామిక రంగంతో నిరుద్యోగ యువతకు ఉపాధి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవి పారిశ్రామిక, వ్యవసాయ రంగాలేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగం …
Read More »గ్రూప్ 1 అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 11న జరిగే గ్రూపు -1 పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం పరీక్షల నిర్వహణపై లైజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 24 మంది అభ్యర్థులు ఉండేవిధంగా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని …
Read More »చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఖేల్ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి షటిల్ బ్యాట్మెంటన్ వేసవి శిక్షణ ముగింపు సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. క్రీడలు ఆడటం వల్ల క్రమశిక్షణ పెరుగుతోందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. జిల్లా స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో …
Read More »కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో విద్యుత్ విజయోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. …
Read More »