Kamareddy

ఐఎన్‌టిఎస్‌ఓ పరీక్షల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాజాగా ప్రకటించిన ఐఎన్‌టిఎస్‌ఓ (ఇండియన్‌ నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలంపియాడ్‌) జాతీయ పరీక్ష ఫైనల్‌ ఫలితాలలో శ్రీ చైతన్య కామారెడ్డి బ్రాంచ్‌కు చెందిన 80 మంది విద్యార్థులు సత్తా చాటి వారి ప్రతిభను నిరూపించుకున్నారని కామారెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కే స్వర్ణలత అన్నారు. వీరిలో ఆరవ తరగతికి చెందిన ఏ కమల్‌ నాయుడుకు రెండవ బహుమతి, …

Read More »

లోక కళ్యాణం కోసమే…

రామారెడ్డి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగిన శ్రీ సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, పాడి పంటలతో, శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని స్వామి వారిని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి …

Read More »

ఎల్‌వోసి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్ధరికి ఎల్‌వోసి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. బిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన గాడి లక్ష్మికి 2 లక్షల 50 వేల రూపాయలు, మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన అంకాలపు మంజులకు రెండు లక్షల రూపాయల ఎల్‌వోసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా …

Read More »

10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

తాడ్వాయి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాసంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తాడువాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలను దృష్టిలో ఉంచుకొని చదవాలన్నారు. జీవితంలో రాణించాలంటే సమయపాలన క్రమశిక్షణ పట్టుదలను అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు గత ఐదు …

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపిపి

రామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందుతుందా?, ప్రామాణికత పాటిస్తున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. హాస్టల్లోని ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థిని విద్యార్థులకు …

Read More »

కంటి వెలుగు శిబిరం తనిఖీ

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ సందర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుర్ల గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర …

Read More »

ఎంబిబిఎస్‌ సీట్ల తెలంగాణ వృద్ధి రేటు 240 శాతం

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన 9 నూతన వైద్య కళాశాల పనులపై జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 9 వైద్య కళాశాల పనుల పురోగతిపై ఆయా …

Read More »

మహనీయుల జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలి

కామరెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహనీయుల జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం మహనీయుల జయంతి వేడుకలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామాలలో, మున్సిపాలిటీలలో అంబేద్కర్‌, జగ్జీవన్‌ రావ్‌ జయంతి వేడుకలు నిర్వహించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో …

Read More »

పాఠశాలను పరిశీలించిన జిల్లా విద్యాధికారి

బాన్సువాడ, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బోర్లమ్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించి, పరీక్ష కేంద్రాలు ఏర్పాటుపై సీసీ కెమెరాలు ఏర్పాటును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానాలను ఆయన అభినందించారు. ఈ …

Read More »

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెంచాలి

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వసతులు, సమస్యల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్‌ కు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »