Kamareddy

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర …

Read More »

సేవాలాల్‌ స్వాముల బైక్‌ ర్యాలీ

బాన్సువాడ, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని సేవాలాల్‌ స్వాములు సోమవారం నిజాంసాగర్‌ మండలంలోని తున్కిపల్లి తండా నుండి బైక్‌ర్యాలీ నిర్వహించి బాన్సువాడ పట్టణంలోని బాల బ్రహ్మచారి శ్రీశ్రీశ్రీ రామ్‌రావ్‌ మహారాజ్‌ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భోగ్‌ భండార్‌ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు బద్యా నాయక్‌ మాట్లాడుతూ సేవాలాల్‌ దీక్ష స్వాములు …

Read More »

సిపిఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం సిపిఆర్‌ శిక్షణ కార్యక్రమాన్ని జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ ప్రారంభించారు. సిపిఆర్‌ చేయు విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సిపిఆర్‌ చేయడంవల్ల వ్యక్తిప్రాణాలను కాపాడవచ్చని సూచించారు. ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సిపిఆర్‌ చేయు విధానాన్ని నేర్చుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా ఆరోగ్య, వైద్యాధికారి …

Read More »

బాలికలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిది

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శనివారం ఫోక్స్‌, జెజె యాక్ట్‌ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోక్స్‌ కోర్ట్‌ ప్రత్యేక స్థలంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. గ్రామస్థాయిలో పోలీస్‌ …

Read More »

గ్రామాల అభివృద్ధికి అధికారుల చొరవ ప్రశంసనీయం

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు చూపిన చొరవ ప్రశంసనీయమని జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం జాతీయ స్థాయి పంచాయతీ అవార్డ్‌ 2023 కు ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు, సన్మానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన …

Read More »

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముదక్‌ పల్లి పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాయబోతున్న 48 మంది విద్యార్థులకు కాల్పోల్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము, ఉపాధ్యాయురాలు స్వప్న పరీక్షా సామాగ్రిని అందించారు. కార్యక్రమానికి అతిథిగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్‌ పాల్గొన్నారు. ముదక్‌ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోశన్న మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులకు కావలసిన సామాగ్రిని కాల్పోల్‌ పాఠశాల అధ్యాపక బృందం …

Read More »

అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న శ్యాంసుందర్‌ (48) కి అత్యవసరంగా బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన అంకాలపు …

Read More »

ప్రభుత్వ పథకాల ఫలాలు అందరికి అందేలా చూడాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలను అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో కంటి వెలుగు, జి. ఓ. నం.58, 59, 76, అర్బన్‌ హౌసింగ్‌, పోడు పట్టాలు, …

Read More »

కామారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ సంఘాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. పేపర్‌ లీకేజీకి కారకులైన కేటీఆర్‌ మంత్రి పదవి నుండి భర్తరఫ్‌ చేయాలని, అసమర్థ టీఎస్పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. అలాగే …

Read More »

రక్తదానం… అభినందనీయం…

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో బాలమని మహిళకు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో టేక్రియాల్‌ గ్రామానికి చెందిన కళాకారుడు డప్పు స్వామి మానవతాదృతంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేసి ఆపరేషన్‌ విజయవంతం అయ్యేలాగా సహకరించారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »