Kamareddy

నివేదికల ఆధారంగా చట్టంలో సంస్కరణలు తీసుకొస్తాం

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ కె తిరుమల్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, చైల్డ్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్స్‌, అంగన్వాడీ టీచర్స్‌, ప్రాంగణ ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చట్టం అమలుతీరును పరిశీలించేందుకు దోమకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టును ఎంపిక చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా సర్వే చేస్తున్నామన్నారు. …

Read More »

ఇంటర్‌ విద్యార్థుల కోసం టెలి మానస్‌ 14416 టోల్‌ ఫ్రీ నెంబరు

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే …

Read More »

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ రవీందర్‌, జిల్లా అధికారులు రాజారాం, …

Read More »

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

బాన్సువాడ, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె డిగ్రీ కళాశాలలో ఆంగ్లం బోధనలో అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందూరు గంగాధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పిజిలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలని, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. అలాగే నెట్‌, సెట్‌, పిహెచ్‌డి …

Read More »

బూత్‌ స్థాయిలో పార్టీ బలంగా ఉండాలి…

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపు మేరకు బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్‌ డే వన్‌ బూత్‌ కార్యక్రమాన్ని భిక్నుర్‌ మండలం కంచర్ల గ్రామంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీ …

Read More »

పొందుర్తిలో వన్‌ డే వన్‌ బూత్‌ కార్యకమ్రం

కామరెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా పిలుపు మేరకు బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్‌ డే వన్‌ బూత్‌ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణా తార మాట్లాడుతూ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం …

Read More »

ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాజీనామా..

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలోని అన్ని వర్గాల పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని స్థానిక బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం మాజీ మంత్రి మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లుగా విద్యార్థి ఉద్యమ నాయకుడు చందు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ నేడు తెలంగాణ ఉద్యమకారులుగా ప్రజలకు …

Read More »

పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత…

కామారెడ్డి మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన సడుగు మల్లేశం గ్రామ పంచాయతీ కార్మికుడు తన కూతురు సుగుణ వివాహానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్‌ వారి సహకారంతో పుస్తె మట్టెలు అందించారు. ఈ సందర్భంగా మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు …

Read More »

ఆర్‌టిసి కార్గో యూనిట్‌ ప్రారంభం

సదాశివనగర్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశినగర్‌ మండలం పద్మాజివాడి ఎక్స్‌ రోడ్‌ వద్ద కార్గో యూనిట్‌ను ఆర్టీసీ కార్గో సంస్థ మూడు జిల్లాల అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ బి. శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో సంస్థను ప్రజలకు చేరువ చేయడానికి ఉమ్మడి జిల్లాలో ఇది 32వ ఏజెన్సీ అని తెలిపారు. ఎక్కడైతే ప్రజలకు అవసరమో అక్కడ మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేయడానికి …

Read More »

మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌ లో ఉన్న ప్లాట్లు, గృహాలు మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం ధరణి టౌన్షిప్‌ ఫ్రీ బిడ్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేలంపాటలో పాల్గొనేవారు కలెక్టర్‌ కామారెడ్డి పేరున రూ.10 వేలు డిడి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »