ఆర్మూర్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా క్షత్రియ కళాశాలల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ విచ్చేసి మాట్లాడారు. పీజీ చదువుతున్న విద్యార్థులు కష్టపడి తమ లక్ష్యాలను సాధించుకోవాలని కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక మార్పులను గమనిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తేనే భారత్ …
Read More »పిఎఫ్ డబ్బులు చెల్లిస్తాం
బాన్సువాడ, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కార్మికులతో చైర్మన్, కమిషనర్ చర్చలు జరపడంతో చర్చలు విజయవంతమయ్యాయని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తెలిపారు. మున్సిపల్ కార్మికులకు రెండు సంవత్సరాల పిఎఫ్ డబ్బులు చెల్లించేందుకు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ రమేష్ కుమార్ అంగీకారం తెలపడంతో మున్సిపల్ కార్మికులు మంగళవారం నుండి విధుల్లోకి చేరనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ …
Read More »ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం
బాన్సువాడ, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో సోమవారం బాన్సువాడ పట్టణానికి చెందిన తేలు కుంట శ్రీధర్, సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత 15 సంవత్సరాలుగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దాత శ్రీధర్ తెలిపారు. కల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు జపాల పాండురంగ …
Read More »గల్ఫ్ వలసలపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం
మానవ చలనశీలతపై చర్చ వాతావరణ మార్పులు – వలసలు, మానవ చలనశీలతపై ప్రభావం అనే అంశంపై అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సోమవారం జగిత్యాలలో చర్చా సమావేశం నిర్వహించింది. వాతావరణ మార్పుల వలన గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వలస కార్మికుల ఆరోగ్యంపై, పని ప్రదేశాల్లో పరిస్థితులపై ఎలాంటి ప్రభావం కలుగుతున్నది అనే విషయంపై చర్చ జరిగింది. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, అకాల వర్షాలు, వరదలు, కరువు …
Read More »ఘనంగా సెవెన్ హార్ట్స్ ఎన్జీవో వార్షికోత్సవం
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ రోటరీ క్లబ్ లో సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మాన్యపు హాజరై మాట్లాడుతూ దేశం మనకెంతో ఇచ్చిందని, మనం కూడా సేవ చేసి దేశం రుణం తీర్చుకోవాలని, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోటి స్వచ్ఛంద సంస్థను స్థాపించిన …
Read More »ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. …
Read More »కలెక్టరేట్ దేవాలయం, అధికారులు దేవుళ్ళు…
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరచి రాష్ట్రం, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుటలో అధికారులు నిబద్దతగా చిత్తశుద్దితో పనిచేయాలని, తన వంతు పూర్తి సహకారమందిస్తానని కామారెడ్డి శాసనసభ్యలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో అవినీతిరహిత పారదర్శక పాలన అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా, నియోజక వర్గ, …
Read More »లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
బాన్సువాడ, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని తాడ్కొల్ గ్రామానికి చెందిన 11 మంది కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆదివారం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు, మార్కెట్ కమిటీ …
Read More »ఘనంగా అయ్యప్ప పడిపూజ
బాన్సువాడ, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో బిజెపి జిల్లా నాయకుడు ఆర్షపల్లి సాయి రెడ్డి అయ్యప్ప దీక్షలో 18 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రుషితుల్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, మధ్యాహ్నం అయ్యప్పకు అభిషేకాలు, భజన పడిపూజ, అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాచారం పీఠాధిపతి శ్రీ మధుసూదనంద సరస్వతి స్వామీజీ …
Read More »శీతాకాలంలో పాడి పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మారుతున్న సీజనకు అనుగుణంగా పంటల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో పాడిపశువుల విషయంలోనూ అన్నే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి సింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు మేతమేయడానికి అంత ఆసక్తి చూపవని దీని వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుందని అందుకే పశువులకు అందించే దాణా విషయంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. …
Read More »