బాన్సువాడ, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని మొగులాన్ గ్రామ శివారులో బాన్సువాడ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్న క్షేత్రస్థాయిలో గుత్తేదారులు నాసిరకం పనులు చేపట్టి పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రధాన రోడ్లపై గుంతలు …
Read More »కాసుల బాలరాజుకు టికెట్ కేటాయించాలి
బాన్సువాడ, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల అభ్యర్థులకు మున్నూరు కాపు కులస్తులకు టికెట్లు కేటాయించాలని శనివారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో మున్నూరుకాపు కులస్తులకు సీట్లు తక్కువ కేటాయించారని, ప్రస్తుతం పెండిరగ్ ఉన్న స్థానాల్లో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ …
Read More »గంజాయి.. నల్ల బెల్లం స్వాధీనం
కామారెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైళ్లలో గంజాయితోపాటు నల్లబెల్లం పట్టికలు తరలిస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం కామారెడ్డి ఆర్‌పిఎఫ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రాంతంలోని లక్ష్మీపూర్ తాండకు చెందిన బరావత్ భద్రమ్మ, భూక్య శాంత, ఈరమ్మలు శుక్రవారం రైల్లో అక్రమంగా తరలిస్తుండగా …
Read More »ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం…
కామారెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ట్యాగ్ చేసి తరలిస్తున్న ధాన్యాన్ని ఎలాంటి పరిమితులు విధించకుండా దించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లకు సంబంచించిన రైస్ మిల్లుల సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, రైస్ మిల్లుల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. …
Read More »అభ్యర్థి ఒకే ఖాతా కలిగి ఉండాలి…
కామారెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యయ నిర్వహణకు సంబంచించి ఎన్నికల కమీషన్ రూపొందించిన చట్టాలు, సెక్షన్ల పై అకౌంటింగ్ టీమ్‌కు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశమందిరంలో వ్యయ నిర్వహణ, ఏం.సి.సి. నోడల్ అధికారులు, సహాయ ఎన్నికల పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ 3 న ఎన్నికల నోటిఫికేషన్, …
Read More »తల్లి బిడ్డల క్షేమాన్ని పర్యవేక్షించాలి
కామారెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసూతి మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు ముందస్తుగా హై రిస్క్‌తో బాధపడుచున్న గర్భిణులను గుర్తించి తగు వైద్య సహాయం అందిస్తూ పర్యవేక్షిస్తుండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రసూతి మరణాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ బి.పి, రక్తహీనత, గుండె జబ్బులు తదితర కారణాలవల్ల …
Read More »విద్యార్థుల సౌకర్యార్థం…
డిచ్‌పల్లి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో అడ్మిషన్స్, స్కాలర్షిప్స్ సెక్షన్ కౌంటర్లలో కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఎండా, వర్షం లాంటి ఆసౌకర్యాలను నివారించడం కొరకు కౌంటర్లపై నూతన షెడ్డును మరియు దరఖాస్తు ఫారం నింపుకొనుటకు సౌకర్యవంతంగా టేబుల్స్ నిర్మాణం విశ్వవిద్యాలయ ఉపకులపతి వాకాటి కరుణ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. దీనివలన దూర ప్రాంతం నుండి బదిలీ సర్టిఫికెట్ల …
Read More »ఎన్నికల విధుల్లో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు
కామారెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణలో ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్ అధికారుల పాత్ర కీలకమని బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో కామారెడ్డి నియోజక వర్గానికి చెందిన పి .ఓ.లు, ఏ.పి .ఓ.లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో 50 మందికి ఒక మాస్టర్ ట్రైనీబీచొప్పున 500 మంది పి .ఓ.లు, …
Read More »105 సంవత్సరాల వృద్ధురాలు మృతి
ఆర్మూర్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం టీచర్స్ కాలనీలో నివసించే 105 సంవత్సరాల వృద్ధురాలైన చిలుక గంగుబాయి, భర్త చిలుక నర్సయ్య (చెంగల్) శుక్రవారం మృతి చెందింది. ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన చంద్రమౌళి తల్లి గంగుబాయి 105 సంవత్సరాలు జీవించారు. ప్రస్తుతం చంద్రమౌళి స్వామి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకారేశ్వరం వద్దగల డోలారి ఆశ్రమంలో ఉంటున్నారు. చంద్ర బిందు మహారాజ్‌కు ప్రధాన శిష్యుడు …
Read More »అగ్రికల్చర్ కోర్స్‌పై విద్యార్థులకు అవగాహన
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్కే డిగ్రీ కళాశాలలో కామారెడ్డిలో నూతనంగా తీసుకువచ్చిన బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్‌పై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ నుంచి జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర సింగ్ ముఖ్యఅతిధిగా విచ్చేసి కోర్స్ యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అగ్రికల్చర్ బీఎస్సీ యొక్క అవశ్యకతను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ మూడు సంవత్సరాల బిఎస్సి అగ్రికల్చర్ …
Read More »