బాన్సువాడ, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ శివారులోని బీర్కూర్ చౌరస్తా నుండి వెళ్తున్న స్కోడా కారును తాడ్కొల్ చౌరస్తా వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయగా నసురుల్లాబాద్ మండలం, అంకోల్ క్యాంప్ చెందిన వ్యక్తి కారులో 9 లక్షల 25 వేలను గుర్తించి స్వాధీనం చేసుకుని డబ్బును డిపాజిట్ చేసినట్లు శుక్రవారం సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »ప్రింటింగ్ ప్రెస్‌లకు ముఖ్య గమనిక
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ శాసనసభ కు జరుగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, 127 ‘‘ఎ’’ సెక్షన్ ప్రకారం ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు లోబడి రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రి ముద్రణ పనులు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ కోరారు. …
Read More »వ్యయ నిర్వహణ కమిటీల పాత్ర ప్రధానమైనది
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు ఏర్పాటు చేసిన బృందాలన్నీ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల విధులు, బాధ్యతలపై నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికలలో ప్రధానమైన టీమ్‌లలో మాడల్ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబరు 27, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 3.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 9.17 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 6.03 వరకు తదుపరి హర్షణం తెల్లవారుజాము 3.13 వరకుకరణం : గరజి సాయంత్రం 4.46 వరకు తదుపరి వణిజ తెల్లవారుజాము 3.45 వరకు వర్జ్యం : రాత్రి …
Read More »రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజంసాగర్ చౌరస్తాలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి మరి కొంత నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్, కౌన్సిలర్ ముప్పరపు ఆనంద్ మాట్లాడారు. తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్నారు. …
Read More »బల్క్ ఎస్‌ఎంఎస్‌లకు అనుమతి పొందాలి
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ నియమావళి మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తుగా అనుమతి పొందిన వాటినే ప్రసారం, ముద్రణ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. …
Read More »డెంగ్యూ బాధితునికి ప్లేట్ లెట్స్ అందజేత…
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన శేఖర్ (45) డెంగ్యూ వ్యాధితో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా డాక్టర్ల సూచనల మేరకు అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరమని వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కరీంనగర్ రక్తదాతల సమూహ నిర్వాహకుడు గాలిపెల్లి …
Read More »గ్రామాలలో ఎక్సైజ్ శాఖ దాడులు
బాన్సువాడ, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కేవ్లానాయక్ తండ, కొయ్యగుట్ట తండా, జక్కలదాని తండా గ్రామాలలో ఎక్సైజ్ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో గ్రామాల్లో నాటు సారా, కల్తీకల్లు కల్లుపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తేజస్విని మాట్లాడుతూ నాటు సారా తయారు, అక్రమంగా గంజాయి రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, ఎన్నికల …
Read More »ఘనంగా దుర్గామాత అమ్మవారి నిమజ్జనం
బాన్సువాడ, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలో భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు అర్చకులు వెంకట్రావు దీక్షితులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత అమ్మవారికి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు భక్తులు చిన్నారులు నృత్యాలతో, కోలాటలతో అమ్మవారి …
Read More »కొయ్యగుట్ట చౌరస్తాలో వాహన తనిఖీలు
బాన్సువాడ, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు వాహనలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో 50 వేలకు మించి డబ్బు ఉన్నట్లయితే అందుకు సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. తనిఖీలు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ముజీబ్, పోలీస్ కానిస్టేబుల్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Read More »