Constituency News

బిఆర్‌ఎస్‌లోకి బిజెపి నాయకుడు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామములోని నూతన గ్రామపంచాయతీగ ఏర్పాటైన హరిపూర్‌ పల్లె గ్రామానికి చెందిన బిజెపి సీనియర్‌ నాయకుడు గ్రామశాఖ అధ్యక్షులు రాజాగౌడ్‌, గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసంలో బిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్బంగా రాజాగౌడ్‌ మాట్లాడుతూ …

Read More »

జిల్లా ప్రజలకు కలెక్టర్‌ దసరా శుభాకాంక్షలు

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెడుపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, దసరా పండుగకు జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు నైతిక భాద్యతగా తమ ఓటు హక్కు విబియోగించుకోవాలని …

Read More »

బట్టలు పంపిణీ చేసిన కరుణ ట్రస్ట్‌ సభ్యులు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలు సంతోషంతో ఉత్సవాలను జరుపుకోవాలని బట్టలను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని కరుణ ట్రస్ట్‌ చైర్మన్‌ మహేష్‌ కుమార్‌ అన్నారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లిలో నిరుపేదల గుడిసెల మధ్యలో చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ… మోర్తాడ్‌ మండలం శేట్పల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న …

Read More »

నాలుగు లక్షలు నగదు పట్టుకున్న పోలీసులు

బాన్సువాడ, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్‌ చౌరస్తా వద్ద పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వెళుతున్న పోగు శ్రీనివాస్‌ను తనిఖీ చేశారు. కాగా అతని నుండి 4.30 లక్షలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు అప్పగించినట్లు పట్టణ సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో 50 వేలకు …

Read More »

జాగ్రత్తగా భద్రపరచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు కేటాయించిన బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివిప్యాట్‌ లను మొదటి రాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా నియోజక వర్గాలకు కేటాయించిన వాటిని క్లోజ్డ్‌ కంటైనర్‌ ఘట్టి పొలీసు భద్రత మధ్య తరలించి అక్కడ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ లో భద్రపరచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శనివారం ఎస్పీ …

Read More »

ఎవరెవరికి ఎక్కడ శిక్షణ

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారుల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ చేశామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ లోని యెన్‌.ఐ.సి. కేంద్రంలో జుక్కల్‌, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతో పాటు బాన్సువాడ నియోజక వర్గంలోని మూడు మండలాలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్‌ కేంద్రాలకు గాను ఎన్నికల …

Read More »

గోదాముల్లో స్థలం, హమాలీలను సమకూర్చాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు భారత ఆహార సంస్థకు కు అందించవలసిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను వేగవంతంగా అందజేయుటకు గాను గోదాములలో అవసరమైన స్థలం, హమాలీలను ఇవ్వవలసినదిగా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ ప్రకాష్‌ వర్మను కోరారు. ఎఫ్‌.సి.ఐ. మేనేజర్‌గా కొత్తగా వచ్చిన ప్రకాష్‌ వర్మ శుక్రవారం అదనపు కలెక్టర్‌ను ఛాంబర్‌లో కలవగా కామారెడ్డి జిల్లా నుండి …

Read More »

బ్యాంకు అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకర్లు తమ లాగిన్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన కామారెడ్డి నియోజక వర్గస్థాయి 2వ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రాప్‌లోన్‌ వీవర్స్‌కు సంబంధించి వచ్చిన సమస్యలు పరిష్కరించాలన్నారు. పంట రుణాలు, బంగారంపై రుణాలు, తీసుకొని …

Read More »

వాహనాల తనిఖీలో నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్‌ చౌరస్తాలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా రెండులక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు శుక్రవారం సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశానుసారం వాహనాల తనిఖీ చేపట్టడం జరుగుతుందని జప్తు చేయబడిన డబ్బులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా …

Read More »

ఎన్నికల అధికారులకు కీలక సూచనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తహసీల్ధార్లు, ఎంపిడిఓలు క్షేత్రస్థాయిలో అన్ని పోలింగ్‌ కేంద్రాలను రూట్‌ వారీగా పరిశీలించి పోలింగ్‌కు అనువైన గదిని ఎంపిక చేసి సిద్ధంచేసేలా చూడవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. ప్రధానంగా పోలింగ్‌ కేంద్రాలు గ్రౌడ్‌ ఫ్లోర్‌లోనే ఉండేలా చూడాలని, ఫర్నీచర్‌, విద్యుత్తూ, మంచినీరు, టాయిలెట్స్‌ ర్యాంప్‌ సౌకర్యాలతో పాటు వీల్‌చైర్‌ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »