Constituency News

ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ..

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్‌ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్‌ రెడ్డి, జాయింట్‌ కన్వీనర్‌గా కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి.. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పబ్లిక్‌ మీటింగ్స్‌ ఇంఛార్జిగా బండి సంజయ్‌, ఛార్జ్‌ షీట్‌ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌ రావు, యాజిటేషన్‌ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతి నియామకం.

Read More »

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకోండి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసంఘటిత రంగాలలో పనిచేస్తూ ఈ-శ్రమ్‌ పోర్టల్‌ నందు పేరు రిజిస్టర్‌ చేసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన, అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఎక్స్‌-గ్రేషియా అందిస్తున్నదని కార్మిక శాఖ సహాయ కమీషనర్‌ సురేందర్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద మార్చి 31, 2022 నాటికి ఈ-శ్రమ్‌ …

Read More »

ఇంగ్లీషు బోధనలో నూతన దృక్పథాలను అలవర్చుకోవాలి

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అనుబంధ కళాశాలల ఇంగ్లీష్‌ అధ్యాపకులకు తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్‌ విభాగం ఆధ్వర్యంలో బోధనలో మెలకువలు దృక్పదాలపై ఓరెంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఇప్లు ఇంగ్లీష్‌ విభాగాధిపతి ఆచార్య జి సువర్ణ లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఇంగ్లీషు భాషలో ఉండే క్లిష్టతను సులభంగా విద్యార్థులకు ఎలా అందించాలో వివరించారు. లిజనింగ్‌, స్పీకింగ్‌, రీడిరగ్‌, రైటింగ్‌, …

Read More »

రక్తదానం చేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ…

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియాతో బాధపడుతున్న లక్ష్మీ (32) మహిళకు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన మురికి రాజు మానవతా దృక్పథంతో స్పందించి మొదటిసారి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు పేర్కొన్నారు. చాలామంది రక్తదానం చేయాలంటే …

Read More »

కామారెడ్డి ఎన్నికల అధికారులకు ముఖ్య సూచనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే శాసనసభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అధికారులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తక్షణమే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, ఆనాటి నుండే ఎన్నికలలో అభ్యర్థుల వ్యయ నియంత్రణను మానిటరింగ్‌ చేయుటకు కమిటీ సమాయత్తం కావాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో …

Read More »

ఇందూరు జన గర్జనకు బయలుదేరిన బిజెపి నాయకులు

బాన్సువాడ, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నిర్వహించే ఇందూరు ప్రజా గర్జన సభకు భారీ సంఖ్యలో బాన్సువాడ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో బిజెపి నాయకులు కార్యకర్తలు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినేందుకు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, కేంద్ర …

Read More »

కళల పీఠాధిపతిగా ఆచార్య త్రివేణి

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కళల పీఠాధిపతిగా తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్‌ ఆచార్య వంగరి త్రివేణి మంగళవారం ఉదయం నియామకం పొందారు. ఉపకులపతి, వాకాటి కరుణ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి కళల పీఠాధిపతి నియామక పత్ర ఉత్తర్వులను ఆచార్య వంగరి త్రివేణికి అందించారు. ఇది వరకు కళల పీఠాధిపతిగా ఉన్న ఆచార్య పి. కనకయ్య నుంచి ఆచార్య వి. …

Read More »

బాల్కొండలో జిల్లా స్థాయి యోగా పోటీలు

బాల్కొండ, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యోగ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్‌ ఆదేశాల మేరకు జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్‌ పోటీలు సోమవారం బాల్కొండ కే.సి.అర్‌. ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాలలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన 232 మంది విద్యార్థులకు బాల్కొండలోని అమృత ధార సేవా సంస్థ వ్యవస్థాపకులు అన్నపూర్ణ …

Read More »

కామారెడ్డిలో మహనీయుల జయంతి

కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అదేవిధంగా జై జవాన్‌ జై కిసాన్‌ నినాదంతో సుపరిచితుడైన, స్వాతంత్య్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి జన్మదినం కూడా నేడని, వారు దేశం కోసం సర్వం త్యజించి , నిజాయితీగా …

Read More »

రక్తదాతలను సత్కరించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రజలు మానవతా హృదయం కలవారని, ఏ సమయంలోనైనా రక్తదానానికి ముందుకురావడం ముదావహమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలలో రక్తదానం పై మీడియా ద్వారా విస్తృత అవగాహన కలిగిస్తున్న జర్నలిస్టులకు, అత్యధికసార్లు రక్తదానం చేసిన వారికి ఆదివారం కర్షక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »