Constituency News

బిజెపి అధికార ప్రతినిధిగా చందూరి హనుమాండ్లు

బీర్కూర్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధికార ప్రతినిధిగా నసురుల్లాబాద్‌ మండలానికి చెందిన చండూర్‌ హనుమాండ్లును బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చందూరి హనుమాండ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా బాన్సువాడలో బిజెపి పార్టీని బలోపేతం చేసి బిజెపి నాయకుడిని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తానని తన మీద …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందనీ, ఇచ్చిన …

Read More »

స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ డైరెక్టర్‌గా డా. జి. బాలకృష్ణ

డిచ్‌పల్లి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి స్పోర్ట్స్‌ మరియు గేమ్స్‌ డైరెక్టర్‌గా డా. జి. బాలకిషన్‌కు నియామక ఉత్తర్వులను అందజేశారు. గతంలో డా. జి. బాలకిషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ మరియు అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆప్‌ ఎగ్జామ్స్‌గా విజయవంతంగా విధులు నిర్వహించి …

Read More »

పురోగతిలో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జహీరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌ బీబీపాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో మాట్లాడారు. పంచాయత్‌ రాజ్‌, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న …

Read More »

వాల్టా చట్టం పకడ్బందీగా అమలు చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు సూచించారు. భూగర్భ జలాల త్రవ్వకాలు, నియంత్రణకు 2002 లో ఏర్పాటు చేసిన చట్టాన్ని మరింత బలోపేతం చేసి సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జి.ఓ. 15 విడుదల చేసిందని కలెక్టర్‌ తెలిపారు. ఇట్టి …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలి…

నందిపేట్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్‌ యోజన కార్యక్రమన్ని పార్టీ మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలని, బూత్‌ల వారిగా కొత్త వారిని చేర్చాలని కోరారు. పైడి రాకెష్‌ రెడ్డి మాట్లాడుతూ …

Read More »

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్‌ జయంతి

బాన్సువాడ, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బిపి మండల్‌ 105 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ గౌడ్‌ మాట్లాడుతూ బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ (1918-1982) భారతదేశ పార్లమెంటు సభ్యుడు, సంఘ …

Read More »

బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

బాన్సువాడ, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు బాన్సువాడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్‌ రాములు అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడను జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం రెవిన్యూ డివిజన్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా …

Read More »

యూనివర్సిటీలో రక్షాబంధన్‌ వేడుకలు

డిచ్‌పల్లి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ ఆచార్య. ఎం.యాదగిరికి ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం గాయత్రి నగర్‌ నిజామాబాద్‌ వారు రాఖీ కట్టి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీబాయి విశ్వవిద్యాలయం లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆచార్య. ఎం. యాదగిరి మాట్లాడుతూ భారతీయ సమాజంలో పవిత్రమైన రక్షాబంధన్‌కు విశిష్టమైన ప్రాధాన్యత ఉందన్నారు. మానవీయ విలువలతో కూడిన విద్యను అందించాలని పేర్కొన్నారు. నైతిక …

Read More »

డాక్టర్‌ మధు శేఖరును సన్మానించిన ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు

ఆర్మూర్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్‌గా ఆర్మూర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు మధుశేఖర్‌ను సీఎం కేసీఆర్‌ ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా గురువారం ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ గల ఎంజె ఆస్పత్రిలో ఆర్మూర్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నూతనంగా నియమితులైన డాక్టర్‌ మధు శేఖర్‌ను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »