Constituency News

మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం బాన్సువాడ పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీగా మెగా ఏజెన్సీ కార్యలయంలో సంబంధిత అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కింద విధులు నిర్వహిస్తున్న కార్మికులు చాలీ చాలని వేతనాలతో కుటుంబాన్ని పోషిస్తున్నారని, కార్మికులకు రావలసిన హక్కులను కాపాడాలని …

Read More »

తల్లిపాలు అమృతంతో సమానం

కామరెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :తల్లిపాలు అమృతంతో సమానమని బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం ఐ.డి.ఓ. సి లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రసవం అయిన వెంటనే వచ్చే ముర్రుపాలు రోగనిరోధక శక్తిని పెంచి బిడ్డను అనేక వ్యాధులు రాకుండా …

Read More »

కామారెడ్డిలో మద్యం దుకాణాల కేటాయింపుల వివరాలు

కామరెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్‌లను ఖరారు చేయడానికి జిల్లా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ లక్కీ డ్రా తీశారు. గురువారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్సి, ఎస్టీ, బిసి త్రిసభ్య కమిటీ అధికారుల ఆధ్వర్యంలో లక్కీ డ్రా చేపట్టారు. జిల్లాలో 49 మద్యం దుకాణాలకు గాను 14 …

Read More »

ఈ సంవత్సరం ఆకస్మిక తనిఖీలుంటాయి

డిచ్‌పల్లి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల ప్రధాన ఆచార్యుల సమావేశానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య. ఎం. యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిధిలో అన్ని విద్యాసంస్థలలో అకాడమిక్‌ వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. కోవిడ్‌ కాలంలో విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని కళాశాల యజమానులు దార్శనికతతో దాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అత్యంత క్రమశిక్షణతో నిర్వహించే తరగతి గది ప్రధాన …

Read More »

ఘనంగా మాజీమంత్రి జన్మదిన వేడుకలు

రెంజల్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీమంత్రి, టీపీసీసీ కోశాధికారి సుదర్శన్‌ రెడ్డి 76 వ జన్మదినవేడుకలు బుధవారం రెంజల్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ మోబిన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థుల మధ్యన కేక్‌ కట్‌ చేసి పండ్లను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్వీట్లు పంచారు. రెంజల్‌ రైతు వేదికలో …

Read More »

అభ్యంతరాలుంటే తెలపాలి

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ కేంద్రాల మార్పుపై అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీల నాయకులు ఈ నెల 3 న మధ్యాహ్నం 2 గంటలలోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. బుధవారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉంటే వాటిపై అభ్యంతరాలను తెలపాలని చెప్పారు. …

Read More »

ఈవిఎం గోదాముల పరిశీలన

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఈ.వి.ఏం. గోదామును బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను సి.సి.కెమెరాల పనితీరును పరిశీలించారు. గోదాములకు సీలు వేసిన తాళాలను చూశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల పర్యవేక్షకులు సాయి భుజంగ రావు, ఉప తహశీల్ధార్‌ ఇందిర ప్రియదర్శిని, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Read More »

బిసి కుటుంబాలలో వెలుగులు

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బి.సి. కుల, చేతి వృత్తుల కుటుంబాలలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి. లోని సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గ బి.సి. లబ్దిదారులకు లక్ష రూపాయల చొప్పున 300 మందికి 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల …

Read More »

విత్తన బంతులు వేసిన విద్యార్థులు

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలములోని కోమన్‌ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హరితహారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా 3034 విత్తనబంతులు తయారు చేశారు. ఇందులో నేరేడు656 వేప357, కానుగ 500, అల్లనేరేడు 1521ఉన్నాయి. వీటిని రోడ్ల కిరువైపుల, ఊరి బయటవేయడం జరిగింది. విద్యార్థుల కృషి,ఆలోచనను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్‌ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూలూరి నర్సయ్య, గ్రామసర్పంచ్‌ నీరడి …

Read More »

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో 12769 గ్రామపంచాయతీలో 50వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వేతనాలు పెంచి క్రమబద్ధీకరించాలని జేఏసీ ఆధ్వర్యంలో 2023 జూలై 6 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య మొండి వైఖరి అవలంబిస్తుందని, తన మొండి వైఖరి విడనాడి వెంటనే జేఏసీతో చర్చలు జరిపాలని, పంచాయతి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సిపిఐ ఎంఎల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »