Constituency News

ఈవిఎం గోదాముల పరిశీలన

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఈ.వి.ఏం. గోదామును బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను సి.సి.కెమెరాల పనితీరును పరిశీలించారు. గోదాములకు సీలు వేసిన తాళాలను చూశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల పర్యవేక్షకులు సాయి భుజంగ రావు, ఉప తహశీల్ధార్‌ ఇందిర ప్రియదర్శిని, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Read More »

బిసి కుటుంబాలలో వెలుగులు

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బి.సి. కుల, చేతి వృత్తుల కుటుంబాలలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి. లోని సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గ బి.సి. లబ్దిదారులకు లక్ష రూపాయల చొప్పున 300 మందికి 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల …

Read More »

విత్తన బంతులు వేసిన విద్యార్థులు

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలములోని కోమన్‌ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హరితహారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా 3034 విత్తనబంతులు తయారు చేశారు. ఇందులో నేరేడు656 వేప357, కానుగ 500, అల్లనేరేడు 1521ఉన్నాయి. వీటిని రోడ్ల కిరువైపుల, ఊరి బయటవేయడం జరిగింది. విద్యార్థుల కృషి,ఆలోచనను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్‌ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూలూరి నర్సయ్య, గ్రామసర్పంచ్‌ నీరడి …

Read More »

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో 12769 గ్రామపంచాయతీలో 50వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వేతనాలు పెంచి క్రమబద్ధీకరించాలని జేఏసీ ఆధ్వర్యంలో 2023 జూలై 6 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య మొండి వైఖరి అవలంబిస్తుందని, తన మొండి వైఖరి విడనాడి వెంటనే జేఏసీతో చర్చలు జరిపాలని, పంచాయతి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సిపిఐ ఎంఎల్‌ …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కాసుల రోహిత్‌

బాన్సువాడ, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన గుత్తి మల్లు కొండకు చెందిన నివాసపు ఇల్లు ఇటీవల భారీ వర్షాలకు కూలిపోవడంతో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకుడు కాసుల రోహిత్‌ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం వారిని పరామర్శించిన పాపాన …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభం

బీర్కూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దామరంచ సొసైటీ చైర్మన్‌ కమలాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీర్కూరు మండలంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎలమంచిలి శ్రీనివాసరావు, పిసిసి డెలిగేట్‌లు డాక్టర్‌ కూనిపూర్‌ రాజారెడ్డి, వెంకటరామరెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ …

Read More »

సమాజ హితం కోసం పనిచేయడం అభినందనీయం

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కామారెడ్డి వైద్య కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామ్‌ సింగ్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఎన్జీవో తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఈ సమాజంలో మారుతున్న పరిణామాలు, పరిస్థితుల దృష్ట్యా సమాజ …

Read More »

పరీక్ష అట్టలు,పెన్నుల వితరణ

ఆర్మూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలములోని కోమన్‌ పల్లి ప్రభుత్వపాఠశాల విద్యార్థులకు ఆర్మూర్‌ కు చెందిన ప్రముఖ దంతవైద్యులు డాక్టర్‌ అనిల్‌ పడాల్‌ 86 పరీక్ష అట్టలు,పెన్నులు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదవకుండా ఇష్టంతో చదువాలని అలాగే దంత పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.అనంతరం డాక్టర్‌ అనిల్‌ పడాల్‌ని గ్రామ సర్పంచ్‌ నీరడి రాజేశ్వర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు …

Read More »

రెడ్‌క్రాస్‌ సేవలు నిరంతరం కొనసాగాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెడ్‌ క్రాస్‌ సంస్థ సేవలు నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో మంగళవారం జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ… సి.పి.ఆర్‌. కార్యక్రమాలను జిల్లా, డివిజన్‌ స్థాయిలో …

Read More »

అయాచితం నటేశ్వర శర్మకు కలెక్టర్‌ సన్మానం

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దాశరధీ పురస్కారాన్ని పొందిన ప్రముఖ సంస్కృతాంధ్ర విద్వత్‌ కవి, అష్టావధాని డాక్టర్‌ ఆయాచితం నటేశ్వర శర్మకు మంగళవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ సముచితంగా సత్కరించారు. జులై 22 న దాశరధి 99వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, క్రీడా శాఖామాత్యులు డా. శ్రీనివాస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »