Constituency News

అయాచితం నటేశ్వర శర్మకు కలెక్టర్‌ సన్మానం

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దాశరధీ పురస్కారాన్ని పొందిన ప్రముఖ సంస్కృతాంధ్ర విద్వత్‌ కవి, అష్టావధాని డాక్టర్‌ ఆయాచితం నటేశ్వర శర్మకు మంగళవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ సముచితంగా సత్కరించారు. జులై 22 న దాశరధి 99వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, క్రీడా శాఖామాత్యులు డా. శ్రీనివాస్‌ …

Read More »

ఉత్తమ డ్రైవర్‌ అవార్డు అందుకున్న గంగాధర్‌

బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డిపోలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ గా విధులు నిర్వహిస్తున్న పందిరి గంగాధర్‌ కు సోమవారం ఆర్టీసీ రీజినల్‌ కార్యాలయంలో ఉత్తమ డ్రైవర్గా అవార్డు ఆర్టీసీ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఎలాంటి పొరపాటు లేకుండా విధులు నిర్వహించి ఉత్తమ అవార్డు రావడంపై గంగాధర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Read More »

నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించండి

హైదరాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్‌ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ గురు కమకొలను, కంటెంట్‌ ఇంజనీరింగ్‌ విభాగం వైస్‌ ప్రసిడెంట్‌ కృష్ణ మోహన్‌ వీరవల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లో భేటీ …

Read More »

ఆగష్టు 3 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బిఈడి 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు 1,2, 3,4వ సెమిస్టర్‌ (2019, 2020, 2021, 2022 బ్యాచ్‌ల) బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3వ తేదీ వరకు గడవు ఉందని, 4వ తేదీ వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ …

Read More »

పని చిన్నదైనా హృదయం చాలా పెద్దది

బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చంటి బిడ్డలకు పాలు ఇచ్చేందుకు రాం ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆర్టీసీ కండక్టర్‌ నాగరాజు బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన చంటి బిడ్డలకు పాలు ఇచ్చే గదిని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ చేయడానికి పని చిన్నదే అయినప్పటికీ హృదయం చాలా గొప్పదని ఆయన నాగరాజును అభినందించారు. …

Read More »

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పిండ ప్రధానం చేసిన కాంగ్రెస్‌ నాయకులు..

బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రైతులకు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమయ్యారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజ్‌ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు వద్ద కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజ్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి …

Read More »

సత్వర పరిస్కారం చూపాలి

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు …

Read More »

బాల్కొండలో పర్మినెంట్‌ ఆర్టీవో ఎక్స్‌ టెన్షన్‌ ఆఫీస్‌

బాల్కొండ, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గ యువతి యువకుల కోసం ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా వేల్పూర్‌ మార్కెట్‌ కమిటి ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాట్‌ బుకింగ్‌,లెర్నింగ్‌ లైసెన్స్‌ అందజేసే ఆర్టీవో ఎక్సటెన్షన్‌ ఆఫీస్‌ సెంటర్‌ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శనివారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లు,స్లాట్‌ బుకింగ్‌ …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి 24 వ వార్డ్‌కి చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను శనివారం స్థానిక కౌన్సిలర్‌ ఆకులరాము ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కెసిఆర్‌కు స్థానిక ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్‌ రాము మాట్లాడుతు పేదింటి ఆడపడచు కట్నంగా లక్ష …

Read More »

విలేఖరి బైక్‌ చోరి….

బీర్కూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్‌కుర్‌ గ్రామంలో ఒక పత్రిక విలేకరికి చెందిన ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం రాత్రి దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. సిసి ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా గత కొద్ది రోజులుగా మండలంలో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గస్తీ నిర్వహించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »