డిచ్‌పల్లి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ రెగ్యులర్, బ్యాక్‌లాక్ సెమిస్టర్ పరీక్షలో 3 వేల 158 మంది విద్యార్థులకు గాను 2 వేల 744 మంది హాజరయ్యారని, 414 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »మెడికల్ కళాశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని మెడికల్ కళాశాల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మెడికల్ కళాశాల నిర్మాణం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా …
Read More »ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు అందుతున్న ఎనిమిది రకాల వైద్య సేవలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం …
Read More »మరో మూడు రోజులు వర్షాలు
హైదరాబాద్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో చాలాచోట్ల సోమ మంగళ, బుధవారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 …
Read More »సీఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితులకు సెల్ ఫోన్ అందజేసిన సిఐ
బాన్సువాడ, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెల్‌ఫోన్లు పోయాయని దరఖాస్తు చేస్తున్న బాధితులకు బాన్సువాడ పట్టణంలోని పోలీస్‌స్టేషన్లో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మంగళవారం టౌన్ సిఐ మహేందర్ రెడ్డి సెల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ దుకాణ యజమానులు ఫోన్లు అమ్మడానికి ప్రయత్నించిన వారి యొక్క సమాచారం పోలీసులకు తెలియజేయాలని, అలాగే పరిచయంలేని వ్యక్తుల వద్ద ఫోన్లు కొనుగోలు చేసి …
Read More »ఘనంగా కాసుల రోహిత్ జన్మదిన వేడుకలు…
బాన్సువాడ, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ యువ నాయకుడు కౌన్సిలర్ కాసుల రోహిత్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కార్యకర్తలు కేక్ కట్‌చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి బీర్కూర్ వరకు పార్టీ కార్యకర్తలు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాసుల రోహిత్ తన తండ్రి అయిన కాంగ్రెస్ పార్టీ …
Read More »ఆకట్టు కుంటున్న పోలీస్ వారి ప్రచారం
బాల్కొండ, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని గ్రామాల్లో కేజ్ వీల్స్ ట్రాక్టర్లు రోడ్ల పై నడపవద్దని పట్టణ పోలీస్ అధికారి కే.గోపి అన్నారు. మంగళవారం బాల్కొండ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పోలీస్ వారిచే ప్రచారం జోరుగా కొనసాగుతోందని బాల్కొండ ఏస్.ఐ కే.గోపి తెలిపారు. బాల్కొండ మండల పరిధిలోని గ్రామాలలో ప్రధాన రహదారులపై నిర్లక్ష్యంగా కేజ్ వీల్స్ ట్రాక్టర్లతో బీటీ …
Read More »దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించాలి
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్డిఓ సాయన్నలతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మాట్లాడారు. జిల్లా కేంద్రంతో …
Read More »విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి ప్రభుత్వ షెడ్యూల్ కులాల వసతి గృహంలో ఎంపీపీ దశరథ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్కులు, నూతన వస్త్రాలు పంపిణి, పర్నిచర్ పంపిణి చేశారు. అనంతరం వారు మాట్లాడుతు ఎమ్మెల్యే సురేందర్ కృషితో వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు గాను 150 మంది అదనంగా వచ్చినట్లు తెలిపారు. సన్నబియ్యం …
Read More »వసతిగృహాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్
డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్‌ను ప్రొఫెసర్ యాదగిరి, రిజిస్ట్రార్ తనిఖీ చేశారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలిపారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి హాస్టల్స్ సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిస్కార మార్గాలను వివరించారు. రిజిస్టర్ వెంట హాస్టల్ చీఫ్ వార్డెన్ డా. మహేందర్, అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ కుమార్, ఎస్టేట్ …
Read More »