బాన్సువాడ, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని 13 వార్డులో సోమవారం నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా టీచర్స్ కాలనీ వారం తప్పు సంతకు వెళ్లేందుకు సీసీ రోడ్డు పనులకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిధులు మంజూరు చేయడంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని …
Read More »రక్తదానానికి ఎల్లవేళలా సిద్దం
కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన లావణ్య (22) రక్తహీనతతో బాధపడుతూ ఉండడంతో వారికి కావాల్సిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని శ్రావణ్ మానవతా దృక్పథంతో స్పందించి రక్తాన్ని అందించారని, అదేవిధంగా స్వరూప (60) మహిళ డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో వారికి అత్యవసరంగా బి పాజిటివ్ సింగిల్ ఓనర్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో వారికి …
Read More »ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు
జక్రాన్‌పల్లి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి మండలం గన్యతాండలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు గాని మూడెకరాల భూమి గానీ, 24 గంటల కరెంటు, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను తెచ్చి ఎందరో …
Read More »జూలై 10 నుండి బియ్యం పంపిణీ
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ఆహారభద్రత కార్డులో పేరున్న ఒక వ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా జులై 10 వ తేదీ నుంచి పంపిణీ చేస్తుందని జిల్లా సివిల్ సప్లయ్ అధికారిని పద్మ తెలిపారు. రేషన్ డీలర్లు బియ్యం అర్హత గల లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Read More »ఆదివాసి నాయకపోడు మండల కమిటీల ఎన్నిక
ఆర్మూర్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్ ఆధ్వర్యంలో మండల కమిటీలు శుక్రవారం నిర్వహించారు. ఆర్మూర్ మండల ఆదివాసి నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షులుగా పుట్ట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి గౌతమ్, ఉపాధ్యక్షులుగా గంగనర్సయ్య, కోశాధికారిగా ఏర్రం వంశీ, కార్యదర్శిగా సింగిరెడ్డి సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ …
Read More »విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
బాన్సువాడ, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కోనాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని గ్రామ సర్పంచి వెంకటరమణారావు దేశ్ముఖ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతోపాటు దుస్తులను అందించడం జరుగుతుందని కావున విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యం వహించరాదని కావున విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని …
Read More »వృద్ధురాలికి రక్తదానం చేసిన ఆర్మీ జవాన్
కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా చాంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన దేవవ్వ (60) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాను కృష్ణ మానవత దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌కు వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు …
Read More »మామిడిపల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
ఆర్మూర్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి సాయి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున ఖాళీ స్థలాలలో నీటి నిల్వలు ఏర్పడి దోమ లార్వా వృద్ధి చెంది మలేరియా డెంగ్యూ చిక్కునుగున్యా ఫైలేరియా వంటి వ్యాధులను కలుగజేస్తాయన్నారు. ఇంటి …
Read More »పార్ట్ టైం అధ్యాపకులను క్రమబద్దీకరించాలి
డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 12 యూనివర్శిటీలలో (680 మంది) పనిచేస్తున్న యూనివర్శిటీ పార్ట్‌టైమ్ లెక్చరర్లందరూ జివో 16 పరిధిలోకి వస్తామని, తమను కూడా క్రమబద్ధీకరణలో చేర్చాలని తెలంగాణ యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల సంఘం ప్రతినిధులు అభ్యర్డిస్తున్నారు. యుజిసి / ఏఐసిటిఇ నిబంధనల ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, కాబట్టి గతంలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మైసూరు, మణిపూర్, పంజాబ్, ఢల్లీి …
Read More »18 నుంచి పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ -ఎంబిఎ, ఎంసిఎ 2వ, 4వ సెమిస్టరు, ఐఎంబిఎ 8వ, 10వ సెమిస్టరు, ఇంటిగ్రేటెడ్ (5 ఐఎంబిఎ, ఏపిఇ, ఐపిసిహెచ్, ఐఎంబిఎ, ఎల్‌ఎల్‌బి 6వ సెమిస్టరు, కి చెందిన రెగ్యులర్, బ్యాక్ లగ్ థియరీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »