ఆర్మూర్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీట్ ఆల్ ఇండియా ఎంబీబీఎస్ పరీక్షలలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన భూమిని పవన్‌కు 545 మార్కులు సాధించి తెలంగాణలో 1207 ర్యాంకును సాధించాడు. ఆల్ ఇండియా నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకు రావడంతో భూమిని పవన్‌ను తల్లిదండ్రులు, మామిడిపల్లి వాసులు అభినందించారు.
Read More »కామారెడ్డిలో 28.60 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం, పొడు భూముల పట్టాల పంపిణీ, పెట్టుబడి సాయం, రెండో విడత గొర్రెల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ, బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపిక, ఆయిల్ ఫామ్ సాగు, యాసంగి ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై సిఎస్ శాంతి కుమారి వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ …
Read More »లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ప్లాస్టిక్ రహిత దినోత్సవం
ఆర్మూర్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో సోమవారం రాం మందిర్ పాఠశాలలో అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయనిలకు నిత్యం ఉపయోగించుకోవాలని జూట్ సంచులు పంచారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు …
Read More »చేపూర్ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు
ఆర్మూర్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం అన్నదాత చేపూర్ గ్రామ వాస్తవ్యులు శెట్టి కిషన్ ఆధ్వర్యంలో ‘‘గురు పౌర్ణమి’’ సందర్భంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతి ఇచ్చి, తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇందూరు సాయన్న, …
Read More »సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
కామరెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ప్రజావాణి లో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు …
Read More »మౌలిక వసతుల కల్పనలో బిఆర్‌ఎస్ విఫలం
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాఠశాలలలో మౌలిక సదుపాయాలని కల్పించాలని నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లిటిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు, జనపల …
Read More »వానాకాలం సాగుకు ఇబ్బంది లేకుండా చర్యలు
హైదరాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా. రైతులకు ఇబ్బంది కలగకుండా వానాకాలం సాగుకు సాగునీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందుకు సంబంధించిన అంశంపై ఆదివారం సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారని మంత్రి వెల్లడిరచారు. సీఎం కేసిఆర్ సమీక్ష సమావేశం అనంతరం …
Read More »సేవ్ లైఫ్ ఫౌండేషన్ సేవలు చిరస్మరనీయం
ఆర్మూర్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండల కేంద్రంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ సభ్యులు ప్రభాస్, దినేష్ చేస్తున్నారు. వీరి సేవలను గుర్తించి ప్రముఖులు అభినందిస్తున్నారు. తాజాగా టీ.ఎస్ .ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ కుమారుడు నిజామాబాద్ జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జెడ్‌పిటిసి బాజిరెడ్డి జగన్ సేవ్ లైఫ్ ఫౌండేషన్ …
Read More »గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కెవిఆర్ గార్డెన్ లో ఆదివారం గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలను గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసిన ఘనత …
Read More »జర్నలిస్ట్ కాలనీలో శ్రమదానం
ఆర్మూర్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛకాలనీ సమైక్యకాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు రెండు గంటలు శ్రమదానం చేసి కాలనీలో రోడ్లను, మురుగు కాలువలను శుభ్రం చేశారు. చీపుర్లతో రోడ్లపై చెత్తాచెదారం ఊడ్చేశారు. పారలు పట్టుకొని పిచ్చిమొక్కలు, ముళ్ళ చెట్లను తొలగించారు. మురుగు కాలువలలో …
Read More »