Constituency News

మంచినీటి ఎద్దడిని తీర్చిన ఘనత కెసిఆర్‌దే

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లాలో మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న మిషన్‌ భగీరథ ప్రాజెక్టు వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడారు. మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర …

Read More »

తెలంగాణ యూనివర్సిటీకి మరో రెండు వసతి గృహాలు

డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీకి ఒక బాలుర వసతి గృహం, ఒక బాలికల వసతి గృహం మంజూరైనట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రకటించారని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాలు గిరిజన పేద విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు. …

Read More »

అనారోగ్య బాధితుడికి రూ.2 లక్షల ఎల్‌వోసీ

ఆర్మూర్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అండగా నిలిచారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన డీ ఆర్‌ ఆర్‌ శశాంక్‌ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. …

Read More »

ఘనంగా మంచినీళ్ల పండగ..

బాన్సువాడ, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణ నగర్‌ తండాలో ఆదివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్‌ ప్రేమ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో మంచినీటి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్‌ ట్యాంకులకు పూలతో అలంకరించి నల్లాలకు పూజలు చేసి అనంతరం గ్రామంలో ర్యాలీగా వెళ్లి గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి …

Read More »

శిశుమందిర్‌కు ఆటవస్తుల విరాళం

బాన్సువాడ, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల విద్యార్థులకు క్రీడా వస్తువులను శనివారం బాన్సువాడ డాక్టర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. బాల్కమల్‌ ఆస్పత్రి డాక్టర్‌ తోటవారి కిరణ్‌ కుమార్‌ తన తోటి డాక్టర్స్‌ అసోసియేషన్‌ సహాయ సహకారాలతో లక్ష రూపాయల విలువచేసే ఆట వస్తువులను పాఠశాలకు అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం డాక్టర్లను అభినందించారు. ఈ …

Read More »

బక్రీద్‌ శాంతియుతంగా నిర్వహించాలి

కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ పండగ వేడుకులు శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. డివిజన్‌ స్థాయిలో శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈనెల 29న జరిగే బక్రీద్‌ పండుగ ఏర్పాట్లకు మున్సిపల్‌, గ్రామపంచాయతీ అధికారులు …

Read More »

ఏసిబి వలలో టియు వైస్‌ఛాన్స్‌లర్‌

డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా ఏసీబీ వలలో పడ్డారు. భీమ్‌గల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు విషయమై రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారని తెలుస్తుంది. పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం వీసీ రవీందర్‌ గుప్తా డబ్బులు డిమాండ్‌ చేశారని, దీంతో బాధితుడు శంకర్‌ ఏసీబీని ఆశ్రయించారు. వర్సిటీలో నియామకాలు, నిధులపై కొంతకాలంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ …

Read More »

కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తాం

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో మునిసిపల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో 9 ఏండ్ల సమయంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి …

Read More »

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరి

డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కామర్స్‌ డిపార్టుమెంటు సీనియర్‌ ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి. రవీందర్‌ గుప్తా శుక్రవారం నియామక ఉత్తరువు జారీ చేశారు.

Read More »

గల్ఫ్‌ జెఏసి కరీంనగర్‌ అధ్యక్షుడిగా రమేష్‌

కరీంనగర్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుబాయి, యూఏఈలో 16 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, అక్కడ మన గల్ఫ్‌ కార్మికుల కోసం చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి చిలుముల రమేష్‌ను గల్ఫ్‌ జెఏసి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర గల్ఫ్‌ జెఏసి చైర్మన్‌ గుగ్గిల్ల రవిగౌడ్‌ తెలిపారు. శుక్రవారం జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు రమేష్‌కు నియామక పత్రం అందజేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »