Constituency News

ఏసిబి వలలో టియు వైస్‌ఛాన్స్‌లర్‌

డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా ఏసీబీ వలలో పడ్డారు. భీమ్‌గల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు విషయమై రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారని తెలుస్తుంది. పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం వీసీ రవీందర్‌ గుప్తా డబ్బులు డిమాండ్‌ చేశారని, దీంతో బాధితుడు శంకర్‌ ఏసీబీని ఆశ్రయించారు. వర్సిటీలో నియామకాలు, నిధులపై కొంతకాలంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ …

Read More »

కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తాం

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో మునిసిపల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో 9 ఏండ్ల సమయంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి …

Read More »

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరి

డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కామర్స్‌ డిపార్టుమెంటు సీనియర్‌ ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి. రవీందర్‌ గుప్తా శుక్రవారం నియామక ఉత్తరువు జారీ చేశారు.

Read More »

గల్ఫ్‌ జెఏసి కరీంనగర్‌ అధ్యక్షుడిగా రమేష్‌

కరీంనగర్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుబాయి, యూఏఈలో 16 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, అక్కడ మన గల్ఫ్‌ కార్మికుల కోసం చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి చిలుముల రమేష్‌ను గల్ఫ్‌ జెఏసి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర గల్ఫ్‌ జెఏసి చైర్మన్‌ గుగ్గిల్ల రవిగౌడ్‌ తెలిపారు. శుక్రవారం జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు రమేష్‌కు నియామక పత్రం అందజేశారు. …

Read More »

సాటాపూర్‌లో దివ్యాంగుల మేళ

రెంజల్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో శనివారం దివ్యాంగుల మేళ నిర్వహిస్తున్నట్లు బోధన్‌ డిపో మేనేజర్‌ టిఎన్‌ స్వామి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సదరం సర్టిఫికెట్‌ ఆధారంగా బస్‌ పాసులను జారీ చేయడం జరుగుతుందని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాటాపూర్‌ గ్రామంలో మేళ కొనసాగుతుందని మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న …

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

రెంజల్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు,మాజీ ఎంపీటీసీ ఆష్టం శ్రీనివాస్‌ తండ్రి గత మూడు రోజుల క్రితం మృతిచెందడంతో గురువారం మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు …

Read More »

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

రెంజల్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సర్పంచ్‌ సునీత నర్సయ్య శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులదేనని ఎండ, వానను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే …

Read More »

చేపూర్‌లో ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం

ఆర్మూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు, సిబ్బందితో పాటు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంతో ర్యాలీగా తరలివచ్చి పల్లె ప్రగతి దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామ పంచాయతీ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామంలో గురువారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న, ఇంచార్జి ఎంపిడిఓ …

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జంగంపల్లి గ్రామంలో 6.45 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో 6 కోట్ల 45 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన …

Read More »

డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక

డిచ్‌పల్లి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బ్యాక్లాగ్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ మరియు 6వ సెమిస్టార్‌ కు చెందిన జియోగ్రఫీ సబ్జెక్టు పరీక్ష ఈ నెల 20 జరగాల్సి ఉండగా 27వ తేదీకీ, 2వ, 3వ,4వ సెమిస్టరు జియోగ్రఫీ పరీక్ష లు ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »