Constituency News

14 నుండి టెన్త్‌ సప్లమెంటరీ ఎగ్జామ్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం జూన్‌ 14 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. 50 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ …

Read More »

హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

రెంజల్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని రెంజల్‌ మండలంలోని నీలా,కందకుర్తి గ్రామాల్లో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. …

Read More »

ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షకు 9 వేల 29మంది విద్యార్థులకు గాను 8 వేల 646మంది హాజరయ్యారని, 383 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 983 మంది నమోదు చేసుకోగా 895 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 88 మంది విద్యార్థులు …

Read More »

ఓటరు జాబితాపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 30,2023 నాటికి 18 ఏళ్ళు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం బిఎల్వో లకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో ఓటర్ల జాబితాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ …

Read More »

14న వైద్య ఆరోగ్య దినోత్సవం

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14 న నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం వైద్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల సహకారంతో వేడుకలు …

Read More »

2కె రన్‌కు అపూర్వ స్పందన

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2 కే రన్‌ కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్‌ ముగింపు సమావేశం ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌ …

Read More »

వివాహిత అదృశ్యం

రెంజల్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ రూప అదృశ్యమైనట్లు ఎస్సై సాయన్న తెలిపారు.ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత వర్ని గ్రామానికి చెందిన కొక్కొండ రూపను గత పదహారేళ్ల కిందట కూనేపల్లి గ్రామానికి చెందిన రొడ్డ రవితో వివాహం జరిగింది. కొన్నేళ్ల వరకు భార్య భర్తల సంసారం సజావుగానే సాగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. …

Read More »

కామారెడ్డి అభివృద్దికి రూ. 2 కోట్ల 64 లక్షలు మంజూరు

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి నియోజవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల 64 లక్షల 25 వేల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. హెల్త్‌ డిపార్ట్మెంట్‌ కొరకు ఒక్క కోటి 80 లక్షలు, నియోజవర్గ అభివృద్ధి కొరకు వివిధ పనులకు …

Read More »

సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల…

హైదరాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే టీఎస్‌ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌-2023 విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం. సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 14 నుంచి 22 వరకు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. అంటే పరీక్ష సమయం 3 గంటల 30 నిముషాలు. ఈ …

Read More »

సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు రావద్దని పేర్కొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »