బాల్కొండ, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లబ్దిదారులతో జరిగిన సంక్షేమ సంబురాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంబురాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి డప్పు చప్పుళ్లతో, మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఘన స్వాగతం పలికారు. సమావేశంలో పలువురు వృద్ధులను,మహిళలను …
Read More »తెలంగాణలో 12 కొత్త కాలేజీలు
హైదరాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మొదలవుతాయని …
Read More »సిడిసి చైర్మన్‌కు సన్మానం
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిడిసి చైర్మన్‌గా (చెరుకు అభివృద్ధి కమిటీ) నూతనంగా ఎన్నికైన ఐరేణి నర్సయ్యను దోమకొండ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం, పద్మశాలి యువజన సంఘం, పాండిదారులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఐరేణి నర్సయ్య మాట్లాడుతూ చెరుకు రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటానని, నాపై నమ్మకంతో సిడిసి చైర్మన్ పదవిని అప్పగించినందుకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు కృతజ్ఞతలు …
Read More »ఈనెలలోనే గృహప్రవేశాలు
ఆర్మూర్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోనీ మోర్తాడ్, భీంగల్, పడగల్, బాల్కొండ గ్రామాల్లో ఈ జూన్ నెలలోనే వారానికి ఒక గ్రామం చొప్పున గృహ ప్రవేశం చేసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్ మండలం పడగల్,బాల్కొండ మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసారు. బాల్కొండ …
Read More »కళాభారతిలో కవిసమ్మేళనం
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11వ తేదీ ఆదివారం సాహిత్య దినోత్సవంను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియమ్‌లో మధ్యాహ్నం 1:00 గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కవిసమ్మేళనములో పాల్గొనే వారు అంబీర్ మనోహర్ రావు, సమన్వయకర్త ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్.నెం:9666692226 ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Read More »ప్లాస్టిక్ నియంత్రణకు కృషిచేయాలి
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ నియంత్రణకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. శ్రీదేవి అన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆవరణలో జిల్లా న్యాయ సేవా సమస్త ఆధ్వర్యంలో గురువారం ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ నిర్మూలనలో మహిళలు భాగస్వాములు కావాలని …
Read More »సకల కులాలకు ఫంక్షన్ హాళ్లు
ఆర్మూర్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజక వర్గంలోని సకల కులాలకు ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని పీయూసీ చైర్మన్, అర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. ‘‘నమస్తే నవనాథపురం’’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్మూర్ పట్టణంలో హుస్నాబాద్ గల్లీలో నిర్వహించిన మున్నురుకాపు కళ్యాణ మండపం (బాజన్న గైని పంత) ప్రహరీ గోడ నిర్మాణ భూమి పూజ …
Read More »మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపల ఆహారం ఆరోగ్యానికి వరం లాంటిదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నాన్ వెజ్, వెజ్ మార్కెట్లో గురువారం చేపల ఆహారమేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపల ఆహార పండగను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు వంద శాతం రాయితీపై చేప విత్తనాలను ఇస్తుందని తెలిపారు. …
Read More »డిగ్రీ ప్రవేశాల కోసం స్పెషల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్ పరిశీలన
డిచ్‌పల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి (దోస్త్ 2023) స్పెషల్ కేటగిరికి సంబంధించిన పిహెచ్ / సిఏపి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 8వ తేదీన టీయు పరిపాలన భవనంలోని డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ కార్యాలయంలో జరుగుతుందని సంబంధిత విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలంగాణ యూనివర్సిటీ దోస్తు కోఆర్డినేటర్ సంపత్ …
Read More »గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి తొలగించొద్దు
జగిత్యాల, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి తొలగించవద్దని గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ వలసలపై అవగాహన, చైతన్య కార్యక్రమంలో భాగంగా బుధవారం గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గల్ఫ్ కార్మిక కుటుంబాలతో గల్ఫ్ జెఏసి బృందం సమావేశమైంది. గల్ఫ్‌కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు …
Read More »