ఆర్మూర్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి తాశీల్డర్ దత్తాద్రి, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మోతే భోజ కళ చిన్నరెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి మల్లేష్, సంఘం …
Read More »రైతు దినోత్సవ సంబురానికి సర్వం సిద్ధం
నిజామాబాద్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించనున్న రైతు దినోత్సవ సంబరానికి సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల 106 రైతు వేదికలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగులతో రైతు వేదికలన్నీ సరికొత్త శోభతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం దశాబ్ది ఉత్సవాలకు …
Read More »3న రైతు దినోత్సవం
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 3న రైతు దినోత్సవం వేడుకలకు అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రైతు దినోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతుబంధు, బీమా, ఉచిత విద్యుత్తు ద్వారా ప్రయోజనం పొందిన రైతులతో సమావేశంలో మాట్లాడిరచాలని తెలిపారు. మండల …
Read More »గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఎస్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈనెల 11న గ్రూప్ -1 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లపై చీప్ సూపరిండ్లతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు …
Read More »హెచ్‌ఐవిపై అవగాహన ర్యాలీ
బాన్సువాడ, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవి, ఎయిడ్స్ అవగాహన ర్యాలీ స్థానిక సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిపిటిసి కౌన్సిలర్ శ్రీలత, ఐసిటిసి కౌన్సిలర్ నర్సింలు, హెచ్‌ఐవి పేషెంట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నెలకోకసారి వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు, గ్రామపంచాయతీ …
Read More »ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
బాన్సువాడ, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనీ ఆపరేషన్ థియేటర్ గదిలో గురువారం ఎసి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించడంతో ఆసుపత్రి బెడ్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. రోగులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు వ్యాపించకుండ అదుపు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సుపరింటెండెంట్ …
Read More »తెలంగాణ వాతావరణం
హైదరాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో విస్తరించేందుకు దాదాపు మరో వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు చెప్పింది. చిరుజల్లులను చూసి తొందరపడి రైతులు విత్తనాలు విత్తుకోవద్దని సూచించింది. చిరుజల్లులకు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు …
Read More »హాస్టల్స్ ఖాళీ చేయండి…
డిచ్‌పల్లి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 1 నుండి 9వ తేదీ వరకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్, సారంగాపూర్ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించడం జరిగిందని, వివిధ హాస్టల్లలో మరమ్మతు పనులు ఉన్నందున సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఆచార్య రవీందర్ గుప్త ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1వ తేదీ మధ్యాహ్న భోజనం తర్వాత …
Read More »ఉత్సవాలకు అధికారులు సిద్దం కావాలి
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి హామీ, సహకార, పోలీస్, పరిశ్రమల, విద్యుత్తు తదితర శాఖల అధికారులు దశాబ్ది వేడుకల ఉత్సవాల …
Read More »కామారెడ్డి వాసులకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సేవలు
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్ లో బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, జాహ్నవి, …
Read More »