ఆర్మూర్, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని గోవింద్‌పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సబ్‌సెంటర్ చేపూర్ గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరం విజయవంతంగా ముగిసింది. మే 2వ తేదీ నుండి ప్రారంభమై మే 22 సోమవారం ముగిసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని మానస తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరంలో మొత్తం 1818 మందికి కంటి …
Read More »తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గాంధారి మార్కెట్ కమిటీలో రైతుల ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిందని తెలియడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తక్షణమే స్పందించారు. సోమవారం వెళ్ళి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే రైతులతో మాట్లాడుతూ రాష్ట్ర …
Read More »తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్వాంచ మండలం రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పల్వంచ రైతు వేదికలో నూతన మండల ఏర్పాటులో భాగంగా సోమవారం మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుదేశించి మాట్లాడారు. పరిపాలన ప్రజల ముందు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాలను …
Read More »క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతోందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇంద్ర గాంధీ స్టేడియంలో సోమవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల యువతి, యువకుల క్రీడ నైపుణ్యాలను వెలికి తీయడానికి సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు …
Read More »నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రతి సంవత్సరం 6, 9 వ తరగతులలో ప్రవేశాల ప్రక్రియను నిర్వహిస్తుండగా, ప్రస్తుత 2023 – 24 విద్యా సంవత్సరంలో నూతనంగా 11వ తరగతిలో ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాసమితి …
Read More »ఇంటి నెంబరు తప్పుంటే అప్‌డేట్ చేసుకోవచ్చు
కామారెడ్డి, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫామ్ -8 నింపి మీ డోర్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఓటర్ల జాబితాల తప్పుల సవరణపై రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో మీ ఇంటి నెంబర్లు తప్పుగా ఉంటే గుర్తించి ఫామ్ -8 నింపి …
Read More »స్పాట్ వాల్యుయేషన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలి
ఆర్మూర్, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ పేమెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 ఏప్రిల్ 21 వరకు స్పాట్ వాల్యుయేషన్ ముగిసినప్పటికీ ఇప్పటివరకు పేమెంట్ ఇవ్వకపోవడం సరికాదని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇంటర్మీడియట్ లెక్చరర్‌లకు వేసవిలో వేతనాలు లేక అవస్థలు పడుతున్న విషయం ఈ ప్రభుత్వానికి …
Read More »సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ఆలూరు, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను క్యాబినెట్‌లో ఆమోదించిన శుభ సందర్భంగా ఆలూర్ మడలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి, మంత్రులకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు వీఆర్‌ఏలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలూర్ మండల అధ్యక్షులు గున్నం సంతోష్, ప్రధాన కార్యదర్శి …
Read More »అక్రమ క్వారీలో మంత్రి ప్రశాంత్ రెడ్డి హస్తం
ఆర్మూర్, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో గత ఏడేళ్లుగా పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరిపి వెంటనే ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వే నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని బాల్కొండ నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. ఈ …
Read More »లబ్దిదారులకు రుణాలు అందించాలి
కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పాడి, మత్స్య పరిశ్రమలకు లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం 2023 మార్చి త్రైమాసిక బ్యాంకుల రుణ వితరణ, పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యా రుణాలను ఇవ్వడానికి బ్యాంకర్లు జిల్లా కేంద్రంలోని బస్టాండ్, …
Read More »