డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి మే 31 వరకు వేసవిసెలవులు ప్రకటించాలని టీజీ సిటిఏ, టీజీ జిసిటిఏ, సంఘాల అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్త్రార్ ప్రొఫెసర్ యాదగిరికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పరీక్షల ఎవల్యూషన్ రెమ్యూనరేషన్ కూడా పెంచాలని, ఎన్సిసి సబ్జెక్టును ఎలక్టివ్‌గా అమలుపరచాలని, పరీక్షల …
Read More »కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కంటి వెలుగు కేంద్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి చంద్రశేఖర్, కౌన్సిలర్ వనిత, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read More »వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
రెంజల్, మే 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని పేపర్ మిల్ గ్రామానికి చెందిన గుర్రాల పోసాని (68) అనే మహిళకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందిందని ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పేపర్ మిల్ గ్రామానికి చెందిన పోసాని గ్రామంలోని వనదుర్గ ఆలయంలో పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కందకుర్తి గ్రామానికి చెందిన శంకర్ …
Read More »క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
నందిపేట్, మే 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం సెజ్‌లో, లక్కంపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం ప్రారంభించారు. క్రీడల ద్వారా యువకుల మధ్య ఐక్యమత్యం స్నేహభావం పెంపొందిస్తాయని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, జీవన ప్రమాణాలను పెంచి ఆరోగ్యంగా ఉంటారని భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల అధ్యక్షులు మచ్చర్లసాగర్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీసీనియర్ నాయకులు ప్రసాదరావు, చిమ్రజ్‌పల్లి ఎంపీటీసీ …
Read More »రైస్ మిల్లర్లతో అత్యవసరంగా సమావేశమైన కలెక్టర్
నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల ద్వారా పంపించే ధాన్యాన్ని వెంటనే అన్ లోడిరగ్ చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైస్ మిల్లర్లకు హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో అత్యవసర …
Read More »నాయక్‌పోడ్ సేవాసంఘం జిల్లా సర్వసభ్య సమావేశం
ఆర్మూర్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో గల తాజ్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఆదివాసి నాయకపోడ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి బొజన్న ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం జిల్లా సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఆదివాసి నాయకపొడ్ కమిటి ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా ఆలూరు గ్రామానికి చెందిన గాండ్ల రామచందర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. పరిశుభ్రమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించాలని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. …
Read More »అభివృద్దే మన ఆయుధం
ఆర్మూర్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమగ్రాభివృద్ధి, సబ్బండవర్గాల సంక్షేమమే మన ఆయుధమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో శనివారం జీవన్ రెడ్డి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్, ఇస్సాపల్లి, గగ్గుపల్లి, మిర్ధపల్లి, ఆమ్దాపూర్, రాంపూర్, …
Read More »బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి
కామారెడ్డి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఓటర్ల జాబితాలలో మృతి వారి పేర్లు తొలగింపు పై రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వారిగా మృతి చెందిన వారి పేర్లను తొలగించాలని …
Read More »ధాన్యం కొనుగోలులో బిల్లుల చెల్లింపులు సత్వరమే జరగాలి
నిజామాబాద్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించిన బిల్లులను సత్వరమే చెల్లించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో …
Read More »