బాన్సువాడ, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నర్సరీలో పెరుగుతున్న మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని బొర్లం గ్రామంలోని గ్రంథాలయాన్ని నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రతి ఇంటింటికీ …
Read More »1,64,656 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయింది
నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో యాసంగి 2022-23 సీజన్‌లో ఇప్పటివరకు 406 కేంద్రాల ద్వారా 20,239మంది రైతుల నుండి 1,64,656 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో …
Read More »గొర్రెల పంపిణీ పథకంపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అమలు తీరుపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం …
Read More »పంటనష్టం జరిగితే విత్తనాల కంపెనీ నుంచి పరిహారం పొందవచ్చు
కామారెడ్డి, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విత్తనాల కారణంగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే రైతులు నష్టపరిహారం పొందే వీలుందని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా అన్నారు. బిక్కనూర్ రైతు వేదికలో శనివారం అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు చైతన్య సదస్సులో ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడారు. …
Read More »నెలరోజుల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛ సర్వేక్షన్ జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డుల కోసం అన్ని గ్రామ పంచాయతీలు పోటీపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛ భారత్ మిషన్, రిలయన్స్ ఫౌండేషన్ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ 2023 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడారు. …
Read More »జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్ శిక్షణ
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రహదారి భద్రత నియమాలు పాటించడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించాలని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తం అందజేత
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో వనిత (33) అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన బి నెగిటివ్ రక్తం కుటుంబ సభ్యులలో ఎవరికి ఆ రక్త వర్గం లేకపోవడంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేశ్ మానవ దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని కె బిఎస్ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ …
Read More »పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలి
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటీల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయిలో గొర్రెల కొనుగోలు బృందం అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం కింద రెండో విడత గొర్రెల కొనుగోలులో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా అధికారులు చూడాలన్నారు. లబ్ధిదారులకు …
Read More »కళ్లకు గంతలు కట్టుకొని విఓఏల నిరసన
ఎడపల్లి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట గురువారం ఐకేపి వీఓఏ ల నిరవధిక సమ్మె ప్రారంభం కాగా నాలుగోవ రోజు కొనసాగింది. ఈ మేరకు నాలుగవ రోజు ఐకేపి వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలు …
Read More »కామారెడ్డిలో భగీరథ జయంతి
కామారెడ్డి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహర్షి భగీరథ తపస్సు వల్ల ఆకాశం నుంచి గంగ భూమి పైకి వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహర్షి భగీరథ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేశారు. …
Read More »