Constituency News

మహిళా సమ్మన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ స్కీంలో చేరండి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల ప్రజలకు చేరువకు ఇప్పటికే వివిధ రకాల సేవలను విస్తృతం చేసిన తపాల శాఖ ఇటీవలే పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచడంతోపాటు మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రత్యేకంగా ‘‘మహిళా సమాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ 2023’’ పేరిట కొత్త స్కీం ప్రవేశపెటింది. గత మార్చి 31న ప్రవేశపెట్టిన స్కీమ్‌ని …

Read More »

యాసంగి కంట్రోల్‌ రూం ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో యాసంగి ధాన్యం కంట్రోల్‌ రూం ను మంగళవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్న ఫోన్‌ నెంబర్‌ 08468-220051 కు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ పద్మ, …

Read More »

30వసారి రక్తదానం చేయడం అభినందనీయం…

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు పద్మావతి (72) కి అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో స్పందించి 30వ సారి రక్తాన్ని కామారెడ్డి బ్లడ్‌ సెంటర్లో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ …

Read More »

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది

కామరెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని హసన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం రాత్రి మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్దిన్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ …

Read More »

రోడ్డు ప్రమాదంలో బిజెవైఎం నాయకుడు మృతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌కు చెందిన ప్రతాప్‌ మారుతి కార్‌లో సోమవారం మధ్యాహ్నం ఆర్మూర్‌ నుండి నిజామాబాద్‌ వెళ్తుండగా కారు ముందు టైరు పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. కారు నడుపుతున్న ప్రతాప్‌కి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలానికి స్థానికులు చేరుకొని వారిని అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు ప్రతాప్‌ మార్గ మధ్యలో మృతి చెందారని …

Read More »

విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని …

Read More »

సోమార్‌పేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తుందని మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌ రావు అన్నారు. మాచారెడ్డి మండలం సోమార్పేటలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్కువ ధరకు రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

ఆటోలో నుంచి పడి యువతి మృతి

ఎడపల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయాణిస్తున్న ఆటోలో నుంచి పడి ఓ యువతి మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌ గ్రామ శివారులో అశోక్‌ సాగర్‌ వద్ద సోమవారం చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. నవీపేట్‌ కు చెందిన పోచమ్మల మైసమ్మ (17) యువతి నిజామాబాదు పట్టణానికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో జాన్కంపేట్‌ శివారులోని అశోక్‌ సాగర్‌ వద్దకు చేరుకోగానే వేగంగా …

Read More »

ఆలూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఆలూరు, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలూర్‌, దేగాం గ్రామాలలో సంఘం చైర్మన్‌ కళ్లెం భోజరెడ్డి, తహసిల్దార్‌ దత్తాద్రి, వైస్‌ చైర్మన్‌ చేపూర్‌ రాజేశ్వర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్‌ మాట్లాడుతూ ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి 2060 …

Read More »

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం

రెంజల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ఎంపీపీ రజినీ కిషోర్‌, జెడ్పిటిసి విజయసంతోష్‌ అన్నారు.సోమవారం రెంజల్‌ మండల కేంద్రంతోపాటు, బాగేపల్లి,దండిగుట్ట, అంబేద్కర్‌ నగర్‌,బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీ, స్థానిక సర్పంచ్‌లతో వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »