మోర్తాడ్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలో బుధవారం రెండు అంగన్‌వాడి సెంటర్లలో పోషణ పక్షంలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు, కిశోర బాలికలకు మిల్లెట్స్ ఎనిమియా, చిరుధాన్యాల విషయమై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్లు కవిత, శోభ తదితరులు పాల్గొన్నారు.
Read More »వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపిపి
రామారెడ్డి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందుతుందా?, ప్రామాణికత పాటిస్తున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. హాస్టల్లోని ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థిని విద్యార్థులకు …
Read More »సైబర్ నేరాల పట్ల తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలి
బాన్సువాడ, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాలు జరగకుండా సైబర్ మోసగాల వలలో పడకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులకు ఎంతో ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషోర్ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ స్వీకరించకుండా, తమకు ఏమైనా …
Read More »అన్ని విధాలా మోర్తాడ్ మండల కేంద్రం అభివృద్ది
మోర్తాడ్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసిఆర్ దయ వల్ల బాల్కొండ నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమం చేశామో..అదే ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ స్విచ్ ఆన్ చేసి …
Read More »కంటి వెలుగు శిబిరం తనిఖీ
కామారెడ్డి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ సందర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుర్ల గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర …
Read More »కేసిఆర్ వల్ల ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నయి
మోర్తాడ్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వేల్పూర్ ప్రయాణంలో అమీనాపూర్ వద్ద గుత్ప,నవాబ్ లిఫ్ట్ ల ద్వారా చెరువులు నింపడానికి కెనాల్ ద్వారా నీరు విడుదల కొనసాగుతుండటంతో… ఆగి కాలువలో పారుతున్న నీటిని చూసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబురపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి వీడియో ద్వారా ప్రజలతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ఎంబిబిఎస్ సీట్ల తెలంగాణ వృద్ధి రేటు 240 శాతం
కామారెడ్డి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన 9 నూతన వైద్య కళాశాల పనులపై జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 9 వైద్య కళాశాల పనుల పురోగతిపై ఆయా …
Read More »పదవ తరగతి విద్యార్థులకు స్టేషనరీ అందజేత
మేడ్చల్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పైచదువులకు పునాది వంటిదని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తుండడంలో బడుల్లో ప్రవేశాలు దొరకని స్థాయికి ఎదిగిందంటే ఈ ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 150 మందికి ప్యాడులు అందజేశారు. ఈ …
Read More »మహనీయుల జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలి
కామరెడ్డి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయుల జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మహనీయుల జయంతి వేడుకలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామాలలో, మున్సిపాలిటీలలో అంబేద్కర్, జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు నిర్వహించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో …
Read More »ప్రాచీన చరిత్ర నిలయం తెలంగాణ ప్రాంతం
డిచ్‌పల్లి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రాంతం ప్రాచీన చరిత్రకు నిలయమని నిజామాబాద్ చరిత్ర కూడా ఎంతో ప్రాచీనమైనదని, తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి రవీందర్ గుప్తా అన్నారు. విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ న్యాయ కళాశాల సెమినార్ హాల్‌లో మంగళవారం ఆరంభమైన తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో చరిత్ర కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించడం …
Read More »