కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్ గ్రామానికి చెందిన చిన్నారి బిందుశ్రీకి గుండె ఆపరేషన్ నిమిత్తమై నిమ్స్ వైద్యశాల హైదరాబాదులో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుదీర్ సహకారంతో …
Read More »పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారని …
Read More »బీర్కూర్లో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు
బీర్కూర్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలోని విలువైన రాగి తీగలు, ఆయిల్ చోరీలకు పాల్పడిన ముఠా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగుతున్నట్లు సమాచారం. బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ వేడుకల్లో ట్రాన్స్‌కో అధికారులు, పోలీస్‌లు నిమగ్నం కాగా, ఇదే అదునుగా చూసుకొని ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు బీర్కూర్ మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 8 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి …
Read More »కంటి వెలుగు శిబిరాల పరిశీలన
ఆర్మూర్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 20 వ వార్డులో గల కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా పరిశీలకుడు డాక్టర్ వెంకటేష్ సందర్శించి కంటి వెలుగు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తమకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో …
Read More »మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ
రెంజల్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి సర్పంచ్ వాణీసాయిరెడ్డి, ఉపసర్పంచ్ ఫెరోజోద్దీన్ గురువారం భూమి పూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల రూపాయలతో పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. అడిగిన వెంటనే రూ.10 లక్షలు మైనార్టీ భవనం నిర్మాణం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ రుణపడి …
Read More »విద్యార్థి దశ నుండే భవిష్యత్ నిర్దేశించుకోవాలి
బోధన్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు విద్యార్థి దశ నుండి భవిష్యత్ ను నిర్దేశించుకోవాలని బోధన్ ఎమ్మెల్యే షెకిల్ ఆమెర్ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిక్కత్ కౌసర్ ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షకీల్, జిల్లా విద్యాధికారి లోకం రఘురాజ్, ధర్పల్లి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు రఫీ యుద్దీన్, హాజరయ్యారు. …
Read More »కెనాల్‌లో దూకి మహిళ ఆత్మహత్య
ఎడపల్లి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఓ మహిళ మనస్తాపంతో గ్రామ శివారులోని కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిరది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జాన్కంపేట్ గ్రామానికి చెందిన వడ్డెర లక్ష్మీ (42) అనే మహిళ గ్రామశివారులోని కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కెనాల్‌లో ఓ మహిళ శవం తేలి …
Read More »తేనెటీగల పెంపకం చేపట్టాలి
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు మండలాల్లో తేనెటీగల పెంపకం కోసం మహిళా సంఘాలను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గాంధారి, రాజంపేట మండలాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉన్నందున తేనెటీగల పెంపకం స్వయం సహాయక సంఘాల మహిళలతో చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా ఉద్యానవన అధికారి విజయభాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారిని …
Read More »శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో స్వాతిక్ అనే విద్యార్థి యజమానుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి మృతికి కళాశాల యజమాన్యం బాధ్యత వహించాలని అలాగే కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ …
Read More »
కాలేశ్వరం నీటితో నిజాంసాగర్ ఎప్పటికీ నిండుకుండలా ఉంటుంది…
సీఎం కేసీఆర్
బీర్కూర్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హెలికాప్టర్లో బాన్సువాడ మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెంకటేశ్వర క్షేత్రానికి వాహనాలలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయానికి …
Read More »