కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నామని కామారెడ్డి రిజిస్ట్రార్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నియమాలను అనుసరించి రిజిస్ట్రేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఫీజులు వసూళ్లు చేస్తున్నామని ఎలాంటి రుసుము అదనంగా వసూళ్లు చేయడం లేదని తెలిపారు. …
Read More »భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
రెంజల్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన ఓ వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో స్లాబ్ లో ఉన్న ఇనుప కొండికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన భీమారాజుకు బాల్కొండ మండలానికి చెందిన ఎత్తం రజితతో 12 ఏళ్ల కిందట …
Read More »కామారెడ్డిలో జాతీయ విజ్ఞాన దినోత్సవం
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల వివేకానంద బీట్ ఆఫర్స్ పాఠశాలలో నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాస్త్ర సాంకేతిక అంశాలపై సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఒకటో తరగతి నుండి తొమ్మిదవ తరగతికి చెందిన విద్యార్థులు 48 అంశాలపై వివిధ రూపాలను ప్రదర్శించారు. భౌతిక రసాయన జీవశాస్త్ర అంశాలపై నిజరూపకలు తయారు చేసి వాటి గురించి వివరంగా సందర్శకులకు …
Read More »రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి…
బాన్సువాడ, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రశాంత్ కాలనీకి చెందిన టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణాతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అమలుకాని హామీలను ఇచ్చి …
Read More »బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి….
బాన్సువాడ, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ, జూక్కల్ ప్రాంత ప్రజల బాన్సువాడ జిల్లా ఏర్పాటు కోరికను బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ఏర్పాటు ప్రకటన చేయాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ జిల్లా ఏర్పాటు కొరకు అఖిలపక్ష నాయకులు, ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులతో …
Read More »11 బ్యాచుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
నందిపేట్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని ఖుదావంద్ పూర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1976-77 నుండి 1986- 87 వరకు 11 బ్యాచుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 236 మందికి గాను 180 మంది ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఉదయం 9 గంటలకు ప్రాథమిక పాఠశాల ఆవరణకు చేరుకుని ముందుగా సరస్వతీ మాతకు పూజా …
Read More »హనుమాన్ దీక్ష స్వాములకు నిత్య అన్నదానం
ఆర్మూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ జ్యోతిర్లింగ ఆశ్రమం ఆర్మూర్ పట్టణంలో దోబీ ఘాట్ నిజామాబాద్ ఎక్స్ రోడ్ ఆర్మూర్ హనుమాన్ మందిరంలో శ్రీశ్రీశ్రీ సిందే మధుకర్ మహారాజ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష 25 సంవత్సరాల సందర్భంగా హనుమాన్ దీక్ష భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిందే మధుకర్ మహారాజ్ కుమారుడు మాట్లాడుతూ ఆశ్రమం వద్ద ప్రతినిత్యం అన్నదానముంటుందని 41 రోజులపాటు …
Read More »మార్చి 1న బీర్కూర్‌కు సిఎం కెసిఆర్
బీర్కూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి మార్చి 1న సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వెంకన్న కొండపై జిల్లా అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్. వి పాటిల్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
Read More »కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సునీత బాబునాయక్ అన్నారు. సోమవారం మండలంలోని మౌలాలి తాండలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి ప్రమోదీతతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు, ప్రిస్క్రిప్షన్స్‌లో మందులు, మోతి …
Read More »ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎవో రవీందర్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రవీందర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని సూచించారు. …
Read More »