Constituency News

కిలిమంజోరా అధిరోహించిన వెన్నెలకు కలెక్టర్‌ అభినందన

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కిలిమంజోరా పర్వతాన్ని అధిరోహించిన బానోతు వెన్నెలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున కిలి మంజరో పర్వతాన్ని ఆమె అధిరోహించిందని తెలిపారు. భవిష్యత్తులో మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తానని పర్వత అధిరోహిని బానోతు వెన్నెల పేర్కొన్నారు.

Read More »

తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్‌..

హైదరాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.. సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తారకరత్న ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘’సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను …

Read More »

ఆస్తి కోసం భర్తను చంపిన భార్య

బాన్సువాడ, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్కొల్‌ గ్రామానికి చెందిన తుమ్మల వెంకటరెడ్డి ఈనెల 23న హత్యకు గురి కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్య అయిన తుమ్మల రుక్మిణి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. వెంకట్‌ రెడ్డి తన ఆస్తిని అక్కచెల్లెళ్లకు ఇస్తానని చెప్పడంతో భార్య అయిన రుక్మిణి రోకలిబండతో చంపి వేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని నిందితురాలిని …

Read More »

నిబంధనల ప్రకారమే పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనల ప్రకారమే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షలు నిర్వహించామని… పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో కోరింది. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని కొద్ది మంది అనవసర రాద్దాంతం చేస్తున్నారని స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని…. ఇకపై ఏటా పి.హెచ్‌.డి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు …

Read More »

కాంగ్రెస్‌ నేతకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

కామరెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల రైతు బందు అధ్యక్షులు గుర్జల నారాయణ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీ ప్లోర్‌ లీడర్‌ నా రెడ్డి మోహన్‌ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఉప్పల్‌ వాయి గ్రామ మాజీ కారోబార్‌ దోనుకంటి కుమార్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

బ్యాంకు లింకేజీ రుణాలు చేపల పెంపకానికి వినియోగించుకోవచ్చు

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా రైతులు చేపల పెంపకంపై దృష్టి సారించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం మోడేగామ, భూంపల్లి గ్రామాల్లో మంగళవారం ఫిష్‌ పాండ్‌లను జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలోని మహిళా సంఘాల నుంచి పదిమంది మహిళా రైతులను ఐకెపి అధికారులు గుర్తించి, …

Read More »

టియు హ్యాండ్‌ బాల్‌ జట్ల ఎంపిక

డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌ గ్రౌండ్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు హ్యాండ్‌బాల్‌ స్త్రీ, పురుషుల జట్ల ఎంపికలు జరిగినట్టు వర్సిటీ డైరెక్టర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ డాక్టర్‌ సంపత్‌ తెలిపారు. ఎంపికల నిమిత్తం వివిధ కళాశాలల నుండి మెన్‌ సెలక్షన్‌లో 35 మంది క్రీడాకారులు, ఉమెన్‌ సెలక్షన్స్‌లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన …

Read More »

బకాయిలు వెంటనే చెల్లించాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్వాక్రా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి రుణాల వడ్డీ బకాయిలు, అభయ హస్తం డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాజంపేట మండల కేంద్రంలో మహిళలు పెద్దమ్మ గుడి నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ఎంపిడివో కార్యాలయం వరకు చేరుకొని ఎంపిడివోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి …

Read More »

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని …

Read More »

అనారోగ్య బాధితుడికి అండగా ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఆపన్నహస్తం అందించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్‌ షఫీ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »