Constituency News

సరిపడా మందులు అందుబాటులో ఉంచాలి

డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :తెలంగాణ విశ్వ విద్యాలయంలోని హెల్త్‌ సెంటర్‌ను వైస్‌ చాన్స్‌లర్‌ రవిందర్‌ గుప్త తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్‌ అనూషకి వీసి సూచించారు. విద్యార్థి ని విద్యార్థులకు, వర్సిటీ సిబ్బందికి సరైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Read More »

సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 39 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 20 లక్షల 22 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1,741 మందికి 10 కోట్ల 72 లక్షల 85 వేల 300 రూపాయల …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మమత (23) గర్భిణీ మహిళ రక్తహీనతతో బాధపడుతున్నడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. జిల్లా కేంద్రానికి చెందిన నరేష్‌ సహకారంతో ఓ పాజిటివ్‌ రక్తాన్ని వీ.టి.ఠాకూర్‌ …

Read More »

ట్రాక్టర్‌ బోల్తా – వ్యక్తి మృతి

బాన్సువాడ, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన పిట్ల మోహన్‌ (30) వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్‌ ట్రాలీ నడుపుకుంటూ నారును తీసుకువస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్‌ అదుపుతప్పి పొలంలో పడడంతో మోహన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం …

Read More »

గోదావరిలో దూకి ఇరిగేషన్‌ డి.ఈ.ఈ ఆత్మహత్య

నవీపేట్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యంచ గోదావరి నదిలో దూకి ఇరిగేషన్‌ డి.ఈ.ఈ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌. ఐ. రాజిరెడ్డి తెలిపారు. ఎస్‌.ఐ, స్థానికుల సమాచారం ప్రకారం మండలంలోని పోతంగల్‌ గ్రామానికీ చెందిన రమణ రావు (46) ఆర్మూర్‌ ఇరిగేషన్‌ డి.ఈ.ఈ. గా విధులు నిర్వహిస్తున్నారు. గత యేడాది ఫిబ్రవరి15 నుండి వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టుకొని హైదరాబాద్‌ లో కుటుంబ సభ్యులతో కలిసి …

Read More »

పరీక్ష తేదీలు మార్పు

డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి సెలవుల దృష్ట్యా 13.1.2023 జరగాల్సిన మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ తెలుగు, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ల పరీక్షను 21.1.2023 కు మరియు 16.1.2023 జరగాల్సిన పరీక్షను 23.1.2023 కు మార్చామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులను నష్టపరిచే ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి, నాయకులు పండ్ల …

Read More »

ఎస్‌ఎంసి చైర్మన్‌కు సన్మానం

రెంజల్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ఎస్‌ఎంసి చైర్మన్‌ గా ఎన్నికైన మమ్మాయి నాగరాజు ను శుక్రవారం సర్పంచ్‌ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ నాయకులు కుర్మె సాయిలు, శ్రీకాంత్‌, రాంచందర్‌, సింహారాయులు తదితరులు ఉన్నారు.

Read More »

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆవరణలోని చింతల బాల్‌ రాజు గౌడ్‌ స్మారక సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి సిలబస్‌ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

వర్షపు నీటిని ఒడిసి పట్టాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కేంద్ర జల శక్తి బోర్డు ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్లో భూగర్భ జలాల సంరక్షణ, వినియోగం, యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కురిసిన వర్షపు నీటిని ఇంకుడు గుంతలు నిర్మించుకొని వాటిలోకి పంపి సంరక్షణ చేయాలని సూచించారు. గ్రామాల్లోని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »