Constituency News

ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎంపీడీవోల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎంపీడీవోల క్యాలెండర్‌, డైరీని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీడీవోలు అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి లక్ష్మి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెన్నారెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ …

Read More »

బాల కార్మికులతో పనిచేయిస్తే యజమానులపై కేసులు

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ఆపరేషన్‌ స్మైల్‌ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఇటుక బట్టీలు, హోటల్లు, గృహ నిర్మాణ పనుల్లో బాల కార్మికులు పనిచేస్తే వారిని గుర్తించి ప్రభుత్వ …

Read More »

రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన గిడ్డంగులు ప్రారంభం

బాల్కొండ జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామంలో 7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన గోడౌన్‌ను గురువారం నాడు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయి చంద్‌తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ… కేసిఆర్‌ రైతులకు రైతు బంధు,రైతు బీమా, కరెంట్‌, …

Read More »

ఆయిల్‌ పాం సాగు నిర్దేశిత లక్ష్యానికి చేరాలి

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక లాభాలను అందించే ఆయిల్‌ పాం పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. తద్వారా ప్రతీ మండలంలోనూ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. గురువారం సాయంత్రం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వ్యవసాయ, ఉద్యానవన, …

Read More »

31 లోగా రుణాలు వసూలు చేయాలి

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 31 లోగా 90 శాతం బ్యాంకు లింకేజీ రుణాలను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల వసుళ్లపై జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఇప్పటివరకు …

Read More »

స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయస్థాయి యువజనోత్సవాలలో జిల్లాలోని యువతి, యువకులు రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలోని చింతల బాలరాజు గౌడ్‌ స్మారక సమావేశ మందిరంలో గురువారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనో త్సవాలు 2023 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ముఖ్య అతిథిగా …

Read More »

ఆలూరు క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలంలోని ఆలూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో ఆలూర్‌ సంఘం క్యాలెండర్‌ 2023ను పియుసి చైర్మన్‌ మరియు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, పిఏసిఎస్‌ చైర్మన్‌ కళ్ళెం భోజ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ చేపూర్‌ రాజేశ్వర్‌, సంఘం డైరెక్టర్లు కళ్ళెం సాయ రెడ్డి, బార్ల సంతోష్‌ రెడ్డి, ఇంగు …

Read More »

నిస్వార్ధ రక్తదానం అభినందనీయం…

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి …

Read More »

జిల్లాస్థాయి టిఎల్‌ఎం మేళాకు బుక్కరజని ఎంపిక

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం మల్లు పేట్‌ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని మండల స్థాయిలో నిర్వహించిన టిఎల్‌ఎం మేళాలో ఆంగ్ల విభాగంలో ఉత్తమ బోధనోపకరణాలను రూపొందించినందుకు గాను జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రదర్శనకు గాను ప్రశంసా పత్రాన్ని మండల విద్యాశాఖ అధికారి యోసఫ్‌, నోడల్‌ అధికారి ప్రేమ్‌ దాసులు అందజేసి …

Read More »

కామారెడ్డికి చేరుకున్న ఎన్నికల సామాగ్రి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంకు 1429 బ్యాలెట్‌ యూనిట్లు, 1017 కంట్రోల్‌ యూనిట్లు బుధవారం వచ్చాయి. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పర్యవేక్షణలో గోదాంలో నిల్వ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి, శీను, తహసిల్దార్లు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »