రెంజల్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథకం నియమ నిబంధనల పాటించాలని తహసిల్దార్ రాంచందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని …
Read More »మౌనికను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు
కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీి పార్లమెంట్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసంగించిన జిల్లా విద్యార్థిని కేతావత్ మౌనికను టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా బృందం ఘనంగా సన్మానించింది. టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ముఖ్యఅతిథిగా ఇటీవల ఢల్లీి పార్లమెంట్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో …
Read More »ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి
జక్రాన్‌పల్లి, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధిలో స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే పల్లెలు మరింత ప్రగతిని సంతరించుకుని సర్వతోముఖాభివృద్ది సాధిస్తాయని అన్నారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలో కీ.శే. జైడి సాయన్న జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జైడి రఘుపతి రెడ్డి స్థానిక గ్రామ పంచాయతీకి స్వర్గరథ వాహనం అందజేశారు. ఈ సందర్భంగా అర్గుల్‌లో ఏర్పాటు చేసిన …
Read More »మిషన్ భగీరథ పనులపై కలెక్టర్ సూచనలు
కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పద్మాజివాడి చౌరస్తా వద్ద వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయడానికి నేషనల్ హైవే అధికారులు మిషన్ భగీరథ పైప్ లైన్లను షిఫ్ట్ చేసేందుకు కావలసిన నిధులను సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నేషనల్ హైవే, మిషన్ భగీరథ అధికారులతో వెహికల్ అండర్ పాస్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. …
Read More »ధాన్యం సేకరణలో నిజామాబాద్ నెంబర్ వన్
వివరాలు వెల్లడిరచిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల …
Read More »ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎడపల్లి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ పటేల్, ఖాజా ఫయాజొద్దిన్‌లను …
Read More »ఏప్రిల్ 3 నుండి ఎస్‌ఎస్‌సి పరీక్షలు
హైదరాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల …
Read More »నాటుసారా కేసులో బైండోవర్ ఉల్లంఘన, ఏడాది జైలు శిక్ష
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్. రవీందర్ రాజు ఆదేశాల అనుసారం ఇటీవల కాలంలో నాటుసారా స్థావరాలపై జరిపిన దాడుల్లో సోమార్ పేటకి చెందిన బానోత్ నీల రెండో సారి నాటుసారా విక్రయిస్తూ పట్టుబడిరది. బైండోవర్ ఉల్లంఘించిన కారణంగా మాచారెడ్డి తాసిల్దార్ సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. ఎవరైనా బైండోవర్ ఉల్లంఘిస్తూ తిరిగి నాటుసారా తయారీ …
Read More »ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’’ ఎగ్జిబిషన్‌లో 38వ నంబర్ స్టాల్‌లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. వారితో …
Read More »ఎన్‌వైకె ఆధ్వర్యంలో అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును స్థానిక పిజెఆర్ స్ఫూర్తి కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీ …
Read More »