కామారెడ్డి, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదటమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి. దివ్య తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ …
Read More »సమాజ పరివర్తన దిశగా ఆర్.ఎస్.ఎస్
హైదరాబాద్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఫ్‌ు కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్ తెలిపారు. బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు, సంఫ్‌ు శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను …
Read More »టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..
కామారెడ్డి, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముస్లిం మతస్తుల పవిత్ర మాసమైన రంజాన్ మాసమును పురస్కరించుకొని జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్ ముఖ్య అతిథులుగా కామారెడ్డి …
Read More »ఇండ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టాలి
కామారెడ్డి, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన నిరుపేద లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మార్కవుట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గృహ నిర్మాణం, పంచాయతీ రాజ్, విద్యుత్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అర్హులైన నిరుపేద లబ్ధిదారుల జాబితాల ప్రతిపాదనల మేరకు …
Read More »ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్
నిజామాబాద్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు …
Read More »మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించాలి
కామారెడ్డి, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పదవతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవుని పల్లి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు అధికారులతో మాట్లాడుతూ, పరీక్ష సమయానికి …
Read More »నవవధువు ఆత్మహత్య
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలోని వల్లేపు లక్ష్మి ,వెంకటేష్ లకు గత నెల 23న వివాహం జరగగా, పెళ్లి ఇష్టం లేకపోవడంతో మంగళవారం నవవధువు వల్లెపు లక్ష్మి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తల్లి …
Read More »బకాయిలు చెల్లించాలి…
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే విశ్రాంత ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో బకాయిలను విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల డివిజన్ కన్వీనర్ శంకర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో విశ్రాంత …
Read More »బాన్సువాడ మున్సిపాలిటీ తైబజార్ బహిరంగ వేలం
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని మేకలు గొర్రెలు, వారాంతపు సంత, రోజువారి సంతను మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో తై బజార్ వేలం నిర్వహించగా రూ.67.77 లక్షలకు గుత్తేదారులు వేలంపాట ద్వారా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేకల గొర్రెల సంత రూ.46.26 లక్షలకు, రోజువారిసంత రూ.9.02 లక్షలకు, వారాంతపు సంత రూ. 12.31 లక్షలకు …
Read More »న్యాయవాదిని హత్య చేసిన దుండగులను శిక్షించాలి..
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న హైదరాబాదులో ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని యాదగిరి అనే దుండగుడు హత్య చేయడం కిరాతకమైన చర్య అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి అన్నారు. మంగళవారం బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయవాదులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి …
Read More »