Constituency News

ప్రాణం తీసిన ఈత సరదా

మేడ్చల్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిర్యాల్‌ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్‌ నాట్కం చెరువులో మునిగి చనిపోయారు. హరహరన్‌, ఉబేద్‌ అనే ఇద్దరు విద్యార్థుల బర్త్‌ డే సందర్భంగా.. తొమ్మిది మంది విద్యార్థులు చిర్యాల్‌ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు చిర్యాల నాట్కం …

Read More »

జాలరి మృతి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో బోయిగల్లికి చెందిన గూండ్ల గణేశ్‌ ఈనెల 26న చేపలు పట్టడానికి వెళ్ళి 27న సాయంత్రం తాళ్ళ చెరువులో శవమై కనిపించాడని నందిపేట్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.

Read More »

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పులకు స్వాగతం పలికిన మంత్రి వేముల

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. రైతులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి కొప్పులకు వేముల పరిచయం చేశారు. …

Read More »

కామారెడ్డి శారదామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్‌ బోర్డు కాలనీ శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు శారదా దేవి గాయత్రి పంచముఖాలతో జగతికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న దేవతగా కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి నవగ్రహాల మహా …

Read More »

సకాలంలో ప్లేట్‌లెట్స్‌ అందజేసి ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆశ్రాన్‌ ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. డెంగ్యూ వ్యాధితో తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌ మానత దృక్పథంతో వెంటనే స్పందించి కెబిసి రక్తనిధి కేంద్రంలో బి పాజిటివ్‌ ప్లేట్‌లెట్స్‌ను అందజేసి ప్రాణాలు కాపాడారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల రెడ్‌క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త …

Read More »

అడవుల రక్షణతోనే భావితరాలకు మేలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనుల దరఖాస్తులను ఈనెల 28 నుంచి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అక్టోబర్‌ 28 లోగ పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలంలో 6 నుంచి 8 బృందాలను ఏర్పాటు చేసి …

Read More »

కామారెడ్డిలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ కేంద్రంలోని 1 వార్డ్‌లో రెండు గదుల ప్రైమరీ స్కూల్‌ భవనమును ప్రారంభించిన 1 వార్డ్‌ కౌన్సిలర్‌ గడ్డమీద రాణి మహేష్‌. ఈ సందర్భంగా 1 వార్డ్‌ కౌన్సిలర్‌ గడ్డమీది రాని మహేష్‌ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆదేశాల మేరకు రెండు గదుల ప్రైమరీ స్కూల్‌ నూతన భవన ప్రారంభించడం జరిగిందన్నారు. తమ గ్రామానికి …

Read More »

జిఓ 59 క్రమబద్దీకరణకు స్థలాలు పరిశీలించిన ఆర్‌డిఓ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 59 ప్రకారం స్థలల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థలాల నమోదు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల అభ్యర్థనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా స్థలాల పరిశీలన చేసి వివరాలను 59 జిఓ వెరిఫికేషన్‌ యాప్‌లో పొందుపరుస్తున్నామని ఆర్ముర్‌ ఆర్‌డిఓ శ్రీనివాస్‌ …

Read More »

శిథిలావస్థలో వాటర్‌ ట్యాంక్‌…

కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశినగర్‌ మండలం భూంపల్లి గ్రామంలో చాలా కాలం కిత్రం నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ శిథిలావస్థకు వచ్చిందని గ్రామస్తులు తెలపడంతో మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, ఉపసర్పంచ్‌ పసుల సాయిలు, వార్డ్‌ మెంబర్‌ రమేష్‌, యాదవ సంఘం పెద్దలు మైపాల్‌, రమేష్‌, తిపిరిశెట్టి రమేష్‌, మరికొంతమంది ప్రజలు వాటర్‌ ట్యాంక్‌ శిథిలావస్థ గురించి మాజీ జెడ్పిటిసికి సూచించారు. ఆదివారం ట్యాంకు పరిశీలించిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »