కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ కూలి కార్మికుడు దామోదర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆర్టీసీ కూలి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిపో మేనేజర్ మల్లేశం రాకపోవడంతో మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం …
Read More »పాల దిగుబడి పెంచేలా చూడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు మహిళలకు ఇప్పించి మేలు జాతి గేదెలను కొనుగోలు చేసే విధంగా అధికారులు …
Read More »రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి రెండో స్థానం
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి జిల్లా రెండవ స్థానంలో ఉందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం ఐకెపి అధికారులతో రుణాల లక్ష్యాలు, బకాయిల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల …
Read More »గొల్లపల్లిలో ఆసరా పింఛన్ల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రామరెడ్డి మండల పరిధిలో గల గొల్లపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సురేందర్ అందజేసిన నూతన ఆసరా ఫించన్ కార్డ్స్‌తో పాటు ఇంతకు ముందున్న ఆసరా ఫించన్ లబ్ధిదారులకు కూడా నూతన ఆసరా ఫింఛన్ కార్డులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రామరెడ్డి మండల వైస్ ఎంపీపీ రవిందర్ రావు, గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ ఆసరా …
Read More »అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన జాదవ్ కృష్ణ
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ధర్మారంకు చెందిన సురేఖ (32) వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌లో అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటవ్ రక్తం అవసరం కావడంతో గాంధారి మండలం బొప్పాజీవాడి గ్రామానికి చెందిన డిగ్రీ మిత్రుడు జాదవ్ కృష్ణ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి రాత్రివేళ అయినా సరే ముందుకు వచ్చి వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసి …
Read More »గొల్లపల్లి గ్రామ సభ
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామరెడ్డి మండల పరిధిలోని గొల్లపల్లిలో గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయితీకి సంబంధించిన ఆదాయ ఖర్చులు గ్రామ ప్రజలకు చదివి వినిపించారు. గ్రామ ప్రజలు పలు సమస్యలు విన్నవించగా గ్రామ సర్పంచ్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామములో ప్రతి ఇంటి వద్ద …
Read More »జిల్లాకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు నూతనంగా బిసి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (ఉమెన్) మరియు బిసి రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్), కామారెడ్డి జిల్లా కు బిసి గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్సం వ్యక్తం చేశారు. నూతనంగా మంజూరు అయిన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరియు బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ అర్బన్ …
Read More »26 నుంచి బతుకమ్మ వేడుకలు
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26 నుంచి బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి అధికారులతో బతుకమ్మ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాస్థాయి, మునిసిపల్, మండల స్థాయిలో బతుకమ్మలు ఆడే ప్రదేశాల్లో విద్యుత్తు లైట్లు అమర్చాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువుల వద్ద …
Read More »పిజి పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 2462 నమోదు చేసుకోగా 2240 మంది హాజరు, 222 విద్యార్థులు గైర్హాజరు …
Read More »పేకాటరాయుళ్ల అరెస్టు
బోధన్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూరా గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు నలుగురు పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేసినట్టు బోధన్ రూరల్ పిఎస్ ఎస్‌హెచ్‌వో సందీప్ పేర్కొన్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ. 7 వేల 200 రూపాయల నగదు సీజ్ చేసినట్టు తెలిపారు. పోలీసు సిబ్బంది ఉన్నారు.
Read More »