Constituency News

బిసి డిక్లరేషన్‌ను అమలు చేయాలి

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రెస్‌ క్లబ్‌ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్‌ ను 42 …

Read More »

సంచార చేపల అమ్మకం వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరా మహిళా శక్తి (ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం) పథకం క్రింద మంజూరు అయిన యూనిట్‌ స్థాపించి ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంచార చేపల అమ్మకం వాహనాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద 10 లక్షల రూపాయలతో …

Read More »

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఈ …

Read More »

అక్రమంగా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదు…

బాన్సువాడ, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కోరుతూ సివిల్‌ సప్లై హామాలీలు చేస్తున్న శాంతియుత నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్‌ రాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హమాలీలకు పెంచిన రేట్లు విడుదల చేయాలని శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసుల చేత అరెస్టు …

Read More »

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నూతన సంవత్సరా క్యాలెండర్లను ఆదివారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌ పార్క్‌లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ రాష్ట్ర కమిటీ మెంబర్‌ మల్లేష్‌ యాదవ్‌ చేతుల మీదుగా పదివేల క్యాలెండర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ మెంబర్‌ మల్లేష్‌ మాట్లాడుతూ తాత తరువాత తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అని మల్లేష్‌ యాదవ్‌ కొనియాడారు. జూనియర్‌ ఆయురారోగ్యాలతో …

Read More »

ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

ఆర్మూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ కోటార్మూర్‌లో గల విశాఖ నగర్‌లో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయము ఆలయ సలహాదారులు మరియు విశాఖ నగర్‌ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కమిటీ 2025 నుండి 2026 వరకు రెండు సంవత్సరాలు ఆలయానికి సేవలు …

Read More »

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల

సదాశివనగర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్వపు సదాశివ నగర్‌ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమంటే, ఆరవ తరగతికి తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివ నగర్‌లో ప్రవేశం పొందడానికి ప్రవేశ పరీక్ష 13 ఏప్రిల్‌ 2025 రోజున నిర్వహించబడుంది, కావున పరీక్షకు …

Read More »

తపస్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సబ్‌ కలెక్టర్‌

బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం తపస్‌ ఉపాధ్యాయ సంఘ డైరీ,క్యాలెండర్‌ ను సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్‌ సంతోష్‌, మహిళా కార్యదర్శి ఉమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్‌, రమేష్‌ కుమార్‌, వేద ప్రకాష్‌, అరుణ్‌ కుమార్‌, తారాచంద్‌, సాయిలు ,శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

బహిరంగ సభకు మైనార్టీలు అధిక సంఖ్యలో తరలి రావాలి…

బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్‌ 26 నుండి జనవరి 26 వరకు సంవిధాన్‌ బచావో ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మైనార్టీ శాఖ పిలుపుమేరకు ఆదివారం హైదరాబాదులోని కులీ కుతుబ్షా గ్రౌండ్‌ లో జరిగే బహిరంగ సభకు ఆల్‌ ఇండియా మైనార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్‌ ప్రతాప్‌ ఘాడీ అధ్యక్షతన నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని మైనార్టీ …

Read More »

సర్వసమాజ్‌ అధ్యక్షున్ని సన్మానించిన కాంగ్రెస్‌ నాయకులు

ఆర్మూర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కాశీ హనుమాన్‌ సంఘంలో సర్వాసమాజ్‌ అద్యక్షుడు కొట్టల సుమన్‌ని శనివారం కాంగ్రెస్‌ నాయకులు సన్మానించారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సుమన్కు అభినందనలు తెలిపి పట్టు శాలువా పూలమాలతో కాంగ్రెస్‌ మైనారిటీ నాయకుడు ఎస్‌.కె. బబ్లూ, కిసాన్‌ కేత్‌ పట్టణ అధ్యక్షుడు బోడమిది బాలకిషన్‌ లు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కొడిగేలా సుధాకర్‌, గుండు లోకేష్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »