నందిపేట్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలో పందుల సైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రోగాల బారిన పడుతున్నారని అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నారని గ్రామ అధ్యక్షులు పెదకాపు సుమన్ ఎద్దేవా చేశారు. నందిపేట మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి పందుల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా …
Read More »మొక్కలు భావితరాల మనుగడకు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు నాటడం వల్ల అవి వృక్షాలుగా మారి భావితరాల మనుగడకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, అధికారులు పాల్గొన్నారు.
Read More »మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలు శాంతియుతంగా జరగడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. విద్యుత్తు …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తికి జైలుశిక్ష
ఎడపల్లి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్యం సేవించి బైకు నడిపిన ఓ వ్యక్తిపై కేసు నమోదు కాగా, శుక్రవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నెలరోజుల జైలుశిక్ష విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గోవూరి హన్మాండ్లు అనే వ్యక్తి మార్చి 21న మంగళ్‌పాడ్ చౌరస్తా వద్ద మద్యం సేవించి బైకు నడుపుతుండగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డాడు. ఎడపల్లి పోలీసులు …
Read More »అసత్యపు ప్రచారాలు మానుకోవాలి..
బీర్కూర్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ నాయకులు అసత్యపు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే ప్రజలు తగిన బుధ్హి చెప్తారని మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పెరుక శ్రీనివాస్, ఎంపీపీ విట్ఠల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన కవితపై బీజేపీ గుండాలు చౌకబారు రాజకీయాలు చేస్తూ ఆమె ఇంటిపై దాడి చేయడం పిరికిపందపు …
Read More »అదుపుతప్పి లారీ బోల్తా
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నుంచి లింగంపేట్ కు వెళ్లే మార్గమధ్య ముస్తాపూర్ గ్రామ శివారులో లారీ బోల్తా పడిరది. కాగా లారీలో ఉన్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప గాయాలు అయిన వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. లారీ నెంబర్ టిఎస్ 15 యు 7888. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »టీయూకు రూ. 25 కోట్ల ప్రతిపాదనలకు సానుకూల స్పందన
డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా నుంచి 25 కోట్ల నిధులకు సానుకూల స్పందన వచ్చిందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా న్యూఢల్లీి పర్యటనలో ఉన్న వీసీ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ డా. చంద్రశేఖర్ శ్రీవారిని కలిసి శాలువాతో సత్కరించారు. అదే విధంగా …
Read More »కామారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ బదిలీ
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ బుధవారం బదిలీపై హైదరాబాద్ కూకట్ పల్లి కోర్ట్ కి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వైద్య అమృతరావు మాట్లాడుతూ గత మూడున్నర …
Read More »నేటి సమాజానికి ఆదర్శం బాలు
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఎస్‌ఆర్కె డిగ్రీ పీజీ కళాశాలలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందిన టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలును ఆర్కే విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, ఎస్‌ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల సీఈవో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో …
Read More »ఇన్‌చార్జి డిపిఆర్‌వోగా రవికుమార్
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఇంచార్జ్ డిపిఆర్‌ఓగా బి. రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట డిపిఆర్‌ఓగా ఉన్న రవికుమార్‌కు కామారెడ్డి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఇంచార్జి గా పనిచేసిన దశరథం, రవికుమార్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు డిపిఆర్‌ఓ రవికుమార్ మొక్కను అందజేశారు. మర్యాదపూర్వకంగా కలిశారు.
Read More »