కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ రోడ్డులో గల ఐవీఎఫ్ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్టు ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉప్పల ట్రస్ట్ ద్వారా పేద వైశ్యులు, అన్ని కులస్తులకు ఉచితంగా పుస్తెలు మట్టెలు వధువుకు …
Read More »జమీల్ సేవలు ఆదర్శనీయం
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈరోజు 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాడువాయి మండలం సంగోజువాడిలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న జమీల్ అహ్మద్‌కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై అందజేసిన ప్రశంస పత్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందజేశారు. కామారెడ్డి రక్తదాతల సమూహ …
Read More »బాలు సేవలు అభినందనీయం
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కరోనా సమయంలో రక్తదానంలో చేస్తున్న సేవలను గుర్తించి ఉత్తమ సామాజిక సేవ పురస్కారాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బాలుకు అందజేసి అభినందించారు. వ్యక్తిగతంగా 66 సార్లు రక్తదానం చేయడం కాకుండా కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా 10వేల యూనిట్ల రక్తాన్ని, కరోనా …
Read More »సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యం
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి …
Read More »అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల టపాకాయలను పేల్చారు. ఆకాశంలోకి రంగురంగుల టపాకాయలను పంపి పేల్చడం చూపరులను ఆకట్టుకుంది. ఆకాశంలో రంగురంగుల మిరమిట్ల కాంతి శోభయమానంగా కనిపించింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »గౌరవ వేతనం వద్దు పేస్కేల్ కావాలి
హైదరాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్‌ఏ రాష్ట్ర జేఏసీ సమావేశం చైర్మన్ ఎం రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్‌ఏలు 20 రోజుల పైగా సమ్మెలో ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని, గత రెండు మూడు రోజులుగా కొన్ని దినపత్రికలలో వీఆర్‌ఏల గురించి వేరువేరు కథనాలు …
Read More »ప్రతిభకు పేదరికం అడ్డురాదు
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిభకు పేదరికం అడ్డురాదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కెనరా బ్యాంకులో ఎస్సీ, ఎస్టీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఇష్టపడి చదివితే విజయం సాధించడం సులభం అవుతుందని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కెనరా బ్యాంక్ ఉద్యోగులు ముందుకు …
Read More »ప్రాచీన కళలు మధురజ్ఞాపకాలు
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాచీన కళలను ప్రోత్సహించడానికి జానపద కళాకారుల ప్రదర్శన ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో ఆదివారం డివిజన్ స్థాయి జానపద కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ భావం, దేశభక్తి స్ఫూర్తితో గ్రామీణ …
Read More »భారీ తిరంగా ర్యాలీ
నందిపేట్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం జుమా నమాజ్ అనంతరం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం ప్రజలు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా’ ‘జై జవాన్ జై కిసాన్’’ అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ …
Read More »కళ్యాణలక్ష్మి, శాదీముబారక్ చెక్కుల పంపిణీ
ధర్పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్పల్లి రైతు వేదికలో జడ్పిటిసి సభ్యుడు బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, శాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను నెర …
Read More »