నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు లబ్ధిదారులు శ్రమను జోడిస్తే ఆశించిన ప్రగతిని సాధించవచ్చని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హితవు పలికారు. దళితబంధు పథకం కింద ప్రభుత్వం అందించిన పది లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో గడ్డం నర్సయ్య అనే లబ్ధిదారుడు ఆర్మూర్ పట్టణంలో కొత్తగా హోటల్ నెలకొల్పగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »ఎమ్మెల్యేను పరామర్శించిన నందిపేట నాయకులు
నందిపేట్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్, నిజామాబాద్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డిని నందిపేట టిఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌లో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఎంతోమంది పేద ప్రజల పక్షాన నిత్యం శ్రమిస్తూ, ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఎవరికి అనారోగ్యం జరిగినా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నా …
Read More »రామన్నపేటలో అష్టావధానం
వేల్పూర్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అష్టావధానం కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన అవధాన విద్యా వాచస్పతి, విశ్రాంత మండల విద్యాధికారిచే అష్ఠావధానం ఉంటుందని తెలిపారు. అవధానంలో నిషిద్దాక్షరి, సమస్య పూరణం, …
Read More »ఎడపల్లిలో చరక మహర్షి జయంతి
ఎడపల్లి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడని ఆయుర్వేద వైద్యుడు డా. వెంకటేష్ పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుర్వేద భవనంలో భారత ఆయుర్వేద పితామహుడు చరక మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీపీ శ్రీనివాస్, వైద్య సిబ్బంది చరక మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా …
Read More »మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అతివేగమే ప్రమాదాలకు కారణం అవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ …
Read More »ఈవిఎం గోదాము పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఏం గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రికార్డులు పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో సివిల్స్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు. కళా భారతి వేదికను జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »బయోమెట్రిక్ యంత్రాల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు బయోమెట్రిక్ యంత్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ, స్వయం సాయిక సంఘాల అనుసంధానంలో డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలను అందిస్తారని చెప్పారు. …
Read More »సివిల్స్ ర్యాంకర్లు జిల్లాకే గర్వకారణం
కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కార్యాలయాల సముదాయమంలో కామారెడ్డి టి.ఎన్.జి.ఓస్ జిల్లా కార్యదర్శి బి.సాయిలు ఆధ్వర్యంలో సివిల్స్‌లో ర్యాంక్ సాధించిన సన్మాన గ్రహీతల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ జితేష్ వి.పాటిల్ సమక్షంలో ఘనంగా సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ పద్మ పే అండ్ అకౌంట్స్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా కామారెడ్డిలో పనిచేస్తున్న వారి కూతురు కుమారి …
Read More »వాణిజ్య శాస్త్ర విభాగంలో గంగాదర్‌కు పిహెచ్.డి
డిచ్‌పల్లి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి మాచర్ల. గంగాదర్ కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయబడిరది. ఆచార్యులు ఎం.యాదగిరి పర్యవేక్షణలో పరిశోధకుడు మాచర్ల. గంగాదర్ ‘‘భారత దేశ బ్యాంకింగ్ రంగంలో బ్యాంకుల సంయోగం మరియు సంలీనం- భారతీయ స్టేట్ బ్యాంకులో అనుబంధ బ్యాంకుల విలీనం ఒక పరిశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని …
Read More »మోర్తాడ్‌లో ఇంటింటా యజ్ఞాలు
మోర్తాడ్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గ్రామంలో ప్రతిరోజు ఇంటింటా యజ్ఞం నిర్వహిస్తున్నట్టు జక్కం రాజు ఆర్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజ్ఞ కార్యక్రమం మోర్తాడ్‌లోని మహర్షి దయానంద ఆశ్రమం ఆర్యసమాజం వారి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా గ్రామంలో ఇంటింటా ప్రతిరోజు యజ్ఞం నిర్వహించడం …
Read More »