బోధన్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు రోజులుగా అలుపెరగకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు మూలమైన సాలురా అంతర్రాష్ట్ర మంజీర నది ఉగ్రరూపం దాల్చుతూంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బోధన్ రూరల్ పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. ఇందుకు ప్రయాణీకులు సహకరించాలని కోరారు. సాలూర వంతెన నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు …
Read More »సోమవారం ప్రజావాణి లేదు
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని పేర్కొన్నారు. అత్యవసర సమస్యలు ఉంటే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు.
Read More »వరదనీరు ఉదృతంగా వస్తుంది.. కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం…
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. పోచారం, కౌలాస్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు ఉదృతంగా వస్తుందని చెప్పారు. జిల్లాలో కంట్రోల్ …
Read More »నిండుకుండలా జన్నెపల్లె పెద్దచెరువు
నవీపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలం జన్నెపల్లె గ్రామములో గల పెద్ద చెరువు జలకళ సంతరించుకుంది. గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా దర్శనమిస్తుంది. లోతట్టు ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం రోజు రోజుకి పెరుగుతుందని గ్రామస్థులు తెలిపారు.
Read More »త్యాగానికి ప్రతిరూపం….బక్రీద్ పండుగ
నందిపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముస్లింల పవిత్ర పండుగలలో ఒకటైన ఈదుల్ ఆజహ (బక్రీద్ పండుగను) ఆదివారం జరుపుకోవడానికి ఈద్గాప్‌ా, మసీదుల వద్ద ఏర్పాటు జరుగుతున్నాయి. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అనగా జంతువని, ఈద్ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్ అని పిలుస్తారు. అరబిక్‌లో …
Read More »మాటు కాలువ సమస్య పరిష్కరించండి…
నవీపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కేంద్రంలోని నాళేశ్వర్ ప్రధాన మాటు కాలువ సమస్య రైతులకి తలనొప్పిగా మారింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంకాగానే వరద నీరు కారణంగా సుమారుగా 50 ఎకరాలలో పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారులకి మాటుకాలువ సమస్యపై విన్నవించినా పట్టించుకునే నాధుడు కరువయ్యారని తెలిపారు. మాటు కాలువ తెగిన సమయంలో 50 …
Read More »నూతన వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించే రుణాలను నూతన వ్యాపారాలు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మహిళలకు పాలు …
Read More »ఒత్తిడి జయిస్తేనే ఉద్యోగ జీవితం విజయవంతం
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పని ఒత్తిడిని జయిస్తేనే ఉద్యోగ జీవితంలో విజవంతమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఉద్యోగుల క్రియేషన్ రూములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగ జీవితంలో ఉన్న పని ఒత్తిడి జయించి చక్కటి ప్రణాళికతో నిర్వహణ చేపడితే ఉద్యోగిగా విజయం సాధించడం సులువుతోందని తెలిపారు. అంకిత భావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులే …
Read More »అటవీ భూములు ఆక్రమించకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అటవీ భూముల సంరక్షణ, హరితహారం కార్యక్రమంపై అధికారులతో శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అటవీ భూములు ఆక్రమించకుండా చూడాలని సూచించారు. వచ్చే హరితహారంలో అటవీ భూములు అటవీశాఖ ఆధ్వర్యంలో …
Read More »రెవెన్యూ యంత్రాంగంను అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నాం
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల కోసం జిల్లా యంత్రాంగాన్ని అన్ని విధాలుగా సన్నద్ధం చేసామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రెవిన్యూ సదస్సుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, …
Read More »