Constituency News

గ్రామంలో మురికి నీరు ఆగకుండా చేయడమే లక్ష్యం..

నందిపేట్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని మూడవ వార్డు బర్కత్‌ పురలో మురికి నీరు ఆగకుండా మురికి కాలువలను శుభ్ర పరుస్తున్నారు. శనివారం వార్డ్‌ మెంబర్‌ మాన్పుర్‌ భూమేష్‌తో కలిసి బర్కత్‌ పూర కాలోని పర్యవేక్షణ చేసి రోడ్డుపై పారుతున్న మురికి కాలువలు శుభ్ర పరచి నీరు ఆగకుండ పనులు చేపట్టారు. అస్తవ్యస్త డ్రైనేజీ మూలంగా ఎక్కడికక్కడ మురికి నీరు ఆగిపోతున్నాయి. …

Read More »

కందకుర్తి రామాలయాన్ని దర్శించుకున్న జాతీయ కార్యదర్శి

బోధన్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ రహక్కర్‌ శుక్రవారం కందకుర్తి గ్రామంలో రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మహిళ , కిసాన్‌ , ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ మోర్చాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రహత్కర్‌ మాట్లాడుతూ తెరాస పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలలోకి …

Read More »

జిల్లా కలెక్టర్‌ శ్రమదానం

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శ్రమదానం చేశారు. ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించారు. ఎండిపోయిన చోట మొక్కలను నాటారు. మొక్కలు ఎండిపోకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమీపంలోని కలెక్టరేట్‌ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జులై 14 లోపు …

Read More »

వైద్యవృత్తి పవిత్రమైనది

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైనదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యులకు సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకిత భావంతో పనిచేసే వైద్యులు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు. …

Read More »

కూలీలు కాదు సేవకులు..

నందిపేట్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని గ్రామాల్లోని వరినాట్లకు కూలీలు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి కూలీలను పిలిపించుకోవాల్సి వస్తున్నటువంటి ప్రస్థుత పరిస్థితిలో కూలికి కాదు సేవకై వస్తామని కూలీ తీసుకోకుండానే వరి నాటడానికి ఉచితంగా పని చేయడానికి వచ్చి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమం పలుగుగుట్ట సమీపంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి …

Read More »

జూలై 4న చలో ప్రగతి భవన్‌

డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దున్నేవానికే భూమి దక్కాలని నినదించిన వీరుడు తొలి అమరవీరుడు కామ్రేడ్‌ దొడ్డి కొమరయ్య 76 వర్థంతి జూలై 4న అమరత్వం పొందిన సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తితో సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భూమి పేదలకు దక్కాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు రైతులపై అక్రమంగా పెట్టిన …

Read More »

ప్లాస్టిక్‌ వస్తువులకు స్వస్తి పలకాలి

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ కవర్లు, వస్తువులకు స్వస్తి పలకాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ప్లాస్టిక్‌ నిషేధంపై టాస్కుఫోర్సు అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు వాడితే దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా పేపర్‌, వస్త్రం, జనపనారతో తయారుచేసిన సంచులు …

Read More »

పీఆర్‌ఓ డైరెక్టర్‌గా డా. త్రివేణి

డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో గల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మరియు ప్రజా సంబంధాల అధికారి డా. వి. త్రివేణి ప్రజా సంబంధాల కార్యాలయానికి డైరెక్టర్‌గా నియామకం పొందారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ నియామక పత్రానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. గురువారం వీసీ చేతుల మీదుగా డా. వి. త్రివేణి …

Read More »

సిం ఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం బజార్‌ కొత్తూరు గ్రామంలో గురువారం సిరికొండ లక్ష్మికి సీ.ఎం. రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును తెరాస నాయకులు అందించారు. నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో ఎంతోమంది పేద వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఎంఎల్‌ఏ జీవన్‌ రెడ్డి పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా ఉన్నాడని కీర్తించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంద పోసాని బాబు రాజ్‌, …

Read More »

అధునాతన యంత్రాలతో రేషన్‌ పంపిణీ సులభతరం

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న నెట్వర్క్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా 4జి నెట్వర్క్‌తో కూడిన విజన్‌ టెక్‌ కంపెనీ ఈ – పాస్‌ మిషన్‌లు, హై రిస్‌ మిషన్‌ యంత్రాలను అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అధునాతన ఈ- పాస్‌ మిషన్‌లు, హై రిస్‌ మిషన్‌ యంత్రాలలో రేషన్‌ పంపిణీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »