Constituency News

అధునాతన యంత్రాలతో రేషన్‌ పంపిణీ సులభతరం

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న నెట్వర్క్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా 4జి నెట్వర్క్‌తో కూడిన విజన్‌ టెక్‌ కంపెనీ ఈ – పాస్‌ మిషన్‌లు, హై రిస్‌ మిషన్‌ యంత్రాలను అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అధునాతన ఈ- పాస్‌ మిషన్‌లు, హై రిస్‌ మిషన్‌ యంత్రాలలో రేషన్‌ పంపిణీ …

Read More »

ప్లాస్టిక్‌ కవర్లను నియంత్రించాలి

బోధన్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను నియంత్రించాలని బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తూము పద్మశారత్‌ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో వ్యాపారస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడారు. జూలై నుంచి ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చిందన్నారు. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ప్లాస్టిక్‌ వస్తువులు క్యారీ …

Read More »

గణాంక సర్వే పారదర్శకంగా చేపట్టాలి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణాంక సర్వేను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మీటింగ్‌ హాల్లో బుధవారం 16వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి. సి. మహా లానోబిస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. …

Read More »

ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం – సి పి నాగరాజు

ఆర్మూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో 45 సిసి కెమెరాలను సిపి నాగరాజు ప్రారంభించారు. బుధవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సిసి కెమెరాలను సిపి కే ఆర్‌ నాగరాజు ప్రారంభించారు. గ్రామస్తులను ద్దేశించి సిపి నాగరాజు మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర నియంత్రణకు ఎంతగానో దోహద పడ్తాయన్నారు. గ్రామంలో ప్రతి ఇంటీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు …

Read More »

ఆరుగురు విద్యార్థుల డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు …

Read More »

సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడులు

ఎడపల్లి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు నాట్లు వేసే ముందు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి భాస్వరంతో కూడిన పిఎస్బి సేంద్రియ ఎరువులను వాడినట్లయితే పంట దిగుబడి అధికంగా ఉంటుందని బోధన్‌ ఏడిఏ సంతోష్‌ అన్నారు. ఎడపల్లి మండలం అంబం (వై) గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వానకాలం పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఏ సంతోష్‌ …

Read More »

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది ‍‍- విసి రవీందర్‌ గుప్త

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల రక్తనిధి కేంద్రంలో మంగళవారం రెడ్‌క్రాస్‌, ఐవిఎఫ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో భాగంగా 28 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టియు వైస్‌ ఛాన్సలర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా మాట్లాడుతూ అన్ని దానాలలో …

Read More »

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

మాక్లూర్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లుర్‌ మండలం గొట్టుముక్కల గ్రామంలో అప్పుల వారి వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి గౌడ్‌ కథనం మేరకు కారం నడిపి భూమన్న (51) ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్‌ఐ అన్నారు.

Read More »

ఎడపల్లి జిపిని సందర్శించిన జడ్పీ సీఈఓ గోవింద్‌

ఎడపల్లి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 3 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పనులు ఆశాజనకంగా జరిగాయని జెడ్పీ సీఈవో గోవింద్‌ అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జడ్పీ సీఈఓ విచ్చేసిన సమయంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. …

Read More »

దేశసేవకు యువత ముందుకు రావాలి

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్నిపథ్‌లో చేరి దేశ సేవ చేయడానికి యువత ముందుకు రావాలని వింగ్‌ కమాండర్‌ సజ్జ చైతన్య అన్నారు. గూగుల్‌ మీట్లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నిపథ్‌ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 17 న్నర ఏళ్ళనుంచి 20 ఏళ్ల లోపు యువత సైన్యంలో చేరవచ్చని సూచించారు. ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌, ఐటిఐ చదివినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాలుగేళ్లపాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »