Constituency News

గ్రామ దేవతలకు గంగాభిషేకం

ఆర్మూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలినడకన గోదావరి నందికి వెళ్లి గంగ నీళ్ళు తీసుకువచ్చి డబ్బుల సప్పుడుతో ఆలూర్‌లో గ్రామ దేవతలకు గంగ నీళ్లు సమర్పించారు. ఊర్లో వర్షాలు పడి, పాడిపంటలు గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మామిడి రాంరెడ్డి, ఉపాధ్యక్షులు కుర్మె సతీష్‌, …

Read More »

వరినాట్లకు సిద్దమైన రైతులు

మోర్తాడ్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలంలోని వడ్యాట్‌, దోన్‌పాల్‌, సుంకెట్‌, పాలెం, తిమ్మాపూర్‌, షెట్‌పల్లి, ధర్మోరా, దొన్‌కల్‌ గాండ్లపేట్‌ మోర్తాడ్‌ మండల కేంద్రంతోపాటు కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, భీమ్‌గల్‌, వేల్పూర్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో గల రైతులు నార్లు పోసి, దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వర్షాలు సరిగా కురియక పోవడంవల్ల భూగర్భ జలాలు బోర్లలో …

Read More »

వడ్డేపల్లిలో ఘనంగా బోనాలు…

ఎడపల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు గ్రామదేవతలకు అత్యంత నియమనిష్ఠలతో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో గ్రామ దేవతల గుడిల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. గ్రామ పొలిమేరలో గల గ్రామ దేవతలకు బోనం సమర్పించిన గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని వేడుకున్నారు. …

Read More »

మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

ఎడపల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు మత్తుపదార్ధాలకు, మద్యానికి దూరంగా ఉండాలని, యువత మత్తుపదార్థాలకు బానిసై కుటుంబాలకు దూరం కావొద్దని బోధన్‌ ఇంచార్జి ఏసీపీ కిరణ్‌ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎడపల్లి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలోని జానకంపేట్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలకు మత్తుపదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్థాలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. …

Read More »

ఐబిపిఎస్‌ పరీక్షకు ఉచిత కోచింగ్‌

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మరియు కామారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఐబిపిఎస్‌ పరీక్షకు బీసి స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌ ఆద్వర్యంలో లో ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇవ్వడం జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బిసి స్టడీ సర్కిల్‌ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. తరగతులు జులై 1వ తేది నుండి ప్రారంభం అవుతాయని, ఇతర వివరాలకు 08462-241055 …

Read More »

ఎగ్జామ్‌ సెంటర్‌ మారింది…

డిచ్‌పల్లి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల కోసం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా వివిధ సాంకేతిక కారణాల వల్ల భీంగల్లులో నలంద డిగ్రీ కళాశాలలో నిర్వహింపబడుతున్న పరీక్షా కేంద్రాన్ని …

Read More »

గ్రామ స్థాయిలో చట్టాలపై అవగాహన

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామస్థాయిలో చట్టాలపై పోలీస్‌, తెలంగాణ …

Read More »

రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాలు లేని సురక్షిత కామారెడ్డి జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అనే అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. …

Read More »

విసి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి దాదాపుగా 10 వేలకు యూనిట్లకు పైగా రక్తాన్ని అందించడం జరిగిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా ప్లాస్మాదానం గురించి అవగాహనతో పాటు 100 యూనిట్ల ప్లాస్మాను కూడా అందజేసి వేలాది మంది ప్రాణాలు కాపాడారు. ప్రస్తుత తరుణంలో కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలోని …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »