కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం లింగం పేట్ మండలం బాయంపల్లి గ్రామంలో ఐ.కే. పి. ఆర్థిక సహకారంతో చేపల పెంపకం, చేపల దాన తయారు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. చేపల పెంపకం దానతయారు చేసేందుకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి ద్వారా కుంట యశోద …
Read More »సర్వే పనులు వేగవంతం చేయాలి…
కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం మీసాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇండ్ల లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరుగుతుందని, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు మంజూరు చేయడానికి …
Read More »కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోగల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి …
Read More »ప్రజావాణిలో 84 ఆర్జీలు
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తదితర సమస్యలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి …
Read More »విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి..
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవినీతి రహిత రాజకీయ వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ టిఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలకు 2024-26 సంవత్సరాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య …
Read More »ట్రై సిరీస్‌లో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ విజేత
ఆర్మూర్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో ఆదివారం రోజు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో నిర్మల్ క్రికెట్ జట్టు, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు, సల్లు క్రికెట్ అకాడమీ జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్ నిర్మల్ క్రికెట్ జట్టు ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు తలపడగా …
Read More »కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి
కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా ఆదివారం కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వెంకటస్వామి చిత్ర పటానికి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారని, …
Read More »23న మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్
కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని పిజెఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్ మరియు ఎకనాలెడ్జ్ ఆధ్వర్యంలో ఎటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ వారు దాదాపు 300 వందల ఉద్యోగుల కొరకు అర్హత గల అభ్యర్థుల కొరకు ఉద్యోగమేలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగ మేళకు హాజరగు అభ్యర్థులు డిగ్రీ అర్హత కలిగి ఉండాలని, డిగ్రీ స్థాయిలో ఏ గ్రూపులైనా విద్యను …
Read More »నర్సరీ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీడీవో
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తండ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నర్సరీ బ్యాగ్ ఫీల్లింగ్ పనులను శనివారం ఎంపీడీవో భషిరోద్దిన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం కోసం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ …
Read More »బాన్సువాడలో కార్గో సర్వీస్ సెంటర్ ప్రారంభం
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్ కేంద్రాన్ని శనివారం డిపో మేనేజర్ సరిత దేవి, కార్గో ఏటీఎం పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా రాష్ట్రంలోని నగరాల నుండి తమ వస్తువులను పార్సెల్ చేసుకోవచ్చని, బాన్సువాడ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కార్గో సేవలను చేసుకోవాలన్నారు. …
Read More »