దోమకొండ, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరానికి ముంబైలో స్థిరపడిన దోమకొండ గ్రామానికి చెందిన అందే శంకర్ ప్రమీల దంపతులు మంగళవారం రూ. 25 లక్షల విలువగల 460 గజాల భూమిని మార్కండేయ పద్మశాలి సంఘానికి విరాళంగా అందజేశారు. ఇంటింటికి మార్కండేయుడు కార్యక్రమంలో భాగంగా వారు భూమిని ఆలయ అధ్యక్షుడు ఐరేని నరసయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధుల సమక్షంలో …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి మార్పు కనిపించాలి
జక్రాన్‌పల్లి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పును సంతరించుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె …
Read More »గురుకుల పాఠశాల తనిఖీ
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లోని మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, మౌలిక వసతులు వివరాలను ప్రిన్సిపల్ ప్రణీతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చూడాలని కోరారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
Read More »అర్బన్ ఫారెస్ట్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి
భీమ్‌గల్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణానికి సమీపంలో లింబాద్రి లక్ష్మి నరసింహాస్వామి గుడి దగ్గర్లో అర్బన్ ఫారెస్ట్ కోసం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అటవీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన ప్రాంతంలో మొక్కలు నాటి నీరుపోశారు. అర్బన్ పార్కుకు సంబంధించిన …
Read More »డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ మధురానగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాద్, పాలిటెక్నిక్ కళాశాలలో పలు డిప్లొమా మూడేండ్ల కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి, (మహిళా, పిల్లల, వికలాంగుల, మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి) శ్రీలత పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్ (డిఈసి), ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (డిఈఈఈ), కంప్యూటర్ …
Read More »రక్తదానం చేయడంలో మొదటి స్థానంలో నిలవాలి
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్తదానం చేయడంలో రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఆర్.కె. డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇతర జిల్లాల ప్రజలకు మన జిల్లా యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. …
Read More »ఆరేపల్లిలో బడిబాట
కామరెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బడిబాట కార్యక్రమం నిర్వహించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రామస్వామి, సెక్టోరియల్ అధికారులు గంగ కిషన్, శ్రీపతి, వేణుగోపాల్ హాజరై మాట్లాడారు. ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పిల్లల సంఖ్య గణనీయంగా పెరగడం అభినందనీయమని …
Read More »ఆపరేషన్ నిమిత్తమై రక్తదానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి గ్రామానికీ చెందిన నేమ్యా (70) కు ఆపరేషన్ నిమిత్తంమై ప్రభుత్వ వైద్యశాలలో బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి 17 వ సారి బి నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ రక్తదానం …
Read More »నవీపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నవీపేట్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరుస ఆకస్మిక తనిఖీలతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న పనుల తీరును, స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను నిశితంగా పరిశీలన జరుపుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నవీపేట మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిపారు. నవీపేట మండల కేంద్రంలోని దర్యాపుర్‌లో గల మండల పరిషత్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను, తడగాం కాలనిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను …
Read More »అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిబిపేట్, దోమకొండ మండలాలకు చెందిన విద్యార్థులు ఆరు సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఎంఎల్‌సి కవిత అధికారంలోకి రాగానే రాయికల్, దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, 2016-17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చారని, …
Read More »