Constituency News

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ తహసిల్దార్‌ కార్యాలయంను సోమవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తహసిల్దార్‌ను ఆదేశించారు. ధరణిలో పెండిరగ్‌ లేకుండా చూడాలని తహసీల్దార్‌ వెంకట్‌ రావుకు సూచించారు.

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్కీడ్రా ద్వారా 20 మంది విద్యార్థుల ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ స్కీం ద్వారా సోమవారం మధ్యాహ్నం లక్కీ డ్రా లాటరీ పద్ధతిలో నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ హైదరాబాద్‌ వారు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌కు 20 సీట్లు కేటాయించారు. మూడో …

Read More »

పట్టణ ప్రగతి పనుల పరిశీలన

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. అయ్యప్ప నగర్లోని పలు రోడ్లు సందర్శించారు. వ్యాపార సమస్తల ముందు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ అంజిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »

పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతితో జిల్లాలోని పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. లింగంపేటలో సోమవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. మండల కేంద్రంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌ను సందర్శించారు. నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా …

Read More »

లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్‌ దంపతులు

నందిపేట్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం సిహెచ్‌ కొండూరులో నూతనంగా నిర్మితమైన రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సోమవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి దంపతులు సందర్శించారు. గత మూడు రోజులుగా ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ సందర్శనకు వచ్చిన కలెక్టర్‌ దంపతులకు సద్బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. కలెక్టర్‌ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర, …

Read More »

సంకల్ప బలంతో శ్రమిస్తే సక్సెస్‌ మీదే

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంకల్ప బలం,పట్టుదల తో శ్రమిస్తే విజయం చెంతకు చేరుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. తెలంగాణ గ్రూప్‌ 1 ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అపజయం ఎదురైనంత మాత్రాన ప్రయత్నించడం మానకూడదని ఆత్వ విశ్వాసంతో ప్రిపేర్‌ అయ్యి …

Read More »

కామారెడ్డిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ పర్యావరణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ఆవరణలో ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మొక్కలను నాటి నీరుపోశారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడం వల్ల ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలోఆర్‌ అండ్‌ బి ఎఈ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.

Read More »

సోమవారం ప్రజావాణి ఉండదు

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 6న సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. అత్యవసర ఫిర్యాదులు ఉంటే కార్యాలయంలో …

Read More »

2వ వార్డులో పట్టణ ప్రగతి పనులు

ఆర్మూర్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ 2 వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కౌన్సిలర్‌ సంగీత ఖాందేశ్‌ కాలోనిలో పర్యటించారు. కాలనీలో వున్న విద్యుత్‌ సమస్యలు, లాంగ్‌ సర్వీస్‌ వైర్లు వున్న చోట ఇంటర్‌ పోల్లు బిగించాలని లైన్‌ఇన్స్పెక్టర్‌ నరేందర్‌ నాయక్‌కు సూచించారు. అలాగే లైన్‌ మెన్‌ రామచందర్‌, శ్రీనివాస్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో విఆర్‌వో అమృతరావ్‌, సత్యానంద్‌ …

Read More »

13 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్‌ సెలబస్‌కు చెందిన బి.ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 13 వ తేదీ వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌ కొనసాగుతుందని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »